Thursday, March 28, 2024
- Advertisement -

రాజు గారికి పీకడానికి సమయం ఆసన్నమైందా..?

- Advertisement -

వైసీపీ పార్టీ లో గెలిచిన అందరు నేతలు ఇప్పటివరకు జగన్ యందు ఎంతో కొంత మంచి పేరు తెచ్చుకుని ఆయనతో ఎప్పటికి మంచి రిలేషన్ షిప్ పెంచుకోవాలని పని చేస్తున్నవారే.. ఆయనకు ప్రజల్లో పెరిగిపోతున్న అభిమానాన్ని బట్టి చూస్తే మరో పదేళ్లు ఆయనే ముఖ్యమంత్రి కావడం ఖాయం కాబట్టి వైసీపీ అధికారంలో ఉంటే తమకు మంత్రి పదవి తప్పక వస్తుంది అని అందరు ఎంతో నిజాయితీగా జగన్ తో ఉంటున్నారు.. అయితే నర్సాపురం రెబల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజు విషయంలో మాత్రం వైసీపీ ఎప్పుడు ఊహించనిది జరుగుతుంది.. తొలుత పార్టీ లోని కొంతమంది ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన రాజు గారు ఆ తరవాత డైరెక్ట్ సీఎం జగన్ ను టార్గెట్ చేయడంతో ఢిల్లీ లో కేంద్ర పెద్దలకు వైసీపీ నేతలు అనర్హత వేయాలంటూ సిఫారసు చేశారు..

కానీ ఢిల్లీ లోని కేంద్రం ఈ విషయాన్నీ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూనే ఉంది.. అవసరం వచ్చినప్పుడు ఈ విషయాన్నీ ఆలోచిద్దామని బీజేపీ అనుకోగా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని రఘు రామ కృష్ణం రాజు టీడీపీ మాదిరి వైసీపీ విమర్శించడం మొదలుపెట్టారు.. కొందరు నాయకులను టార్గెట్ చేసి జగన్ ను సైతం విమర్శిస్తూ జగన్ ఆగ్రహాన్ని కూడా కొనితెచ్చుకున్న. అయితే వైసీపీ లో రఘు రామ ను ఇంకేం చేయలేమా అనే భావన మొదలైన నేపథ్యంలో ఆయనను మాజీ చేయడానికి ఓ అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ నుంచి ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారు..

దాంతో వారికి విశ్వసనీయత పరీక్షా ఎదురుకానుంది.. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరిని పార్టీలో చేర్చుకోవాలి. అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీని ఎన్డీయేలోకి తీసుకురావడం ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా మా బలం పెరిగింది అని చెప్పుకోవచ్చు. అలాగే సౌత్ లో మేము గట్టిగా ఉన్నాం, తెలుగు రాష్ట్రాలో ఒక చోట మిత్ర పక్ష ప్రభుత్వం ఉందని కూడా ఢంకా భజాయించి చెప్పుకోవచ్చు. అందుకే బీజేపీ ఇపుడు జగన్ ని చేరదీస్తోందని అంటున్నారు. అయితే జగన్ కూడా రఘు రామ కృష్ణం రాజు విషయం తేల్చితే కానీ సపోర్ట్ విషయంలో ఏ నిర్ణయం చెప్పలేను అన్నట్లు వ్యవహరిస్తుండడంతో బీజేపీ అనర్హత వేటును మరొకసారి పరిశీలించనుంది.. ఒకవేళ అన్ని అనుకున్నట్లు అయితే రఘు రామ కృష్ణ రాజు తొందరలో మాజీ ఎంపీ అవనున్నాడన్న మాట..

అసెంబ్లీ సమావేశాల వేళా చంద్రబాబు కి బిగ్ షాక్ ఇవ్వనున్న జగన్..?

సొంత పార్టీ లోనే చంద్రబాబు కు వ్యతిరేక కూటమి తయరైందా..?

సాగునీటి ప్రాజెక్టులపై జగన్ నిరంతర పర్యవేక్షణ… రూ.96,550 కోట్లు ఖర్చు

జగన్ అంటే ఆ వైసీపీ ఎమ్మెల్యే మండిపడుతోందట…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -