Friday, March 29, 2024
- Advertisement -

ఖ‌మ్మంలో స‌రికొత్త రాజ‌కీయ ఆవిష్క‌ర‌ణ‌….

- Advertisement -

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ల‌లేం. మ‌ద్ద శ‌త్రువులుగా ఉన్న పార్టీలు ఎప్పుడు మిత్రులు అవుతారో…మిత్రులుగా ఉన్న పార్టీలు శ‌త్రువులుగా మార‌డం రాజీకీయాల్లో స‌హ‌జం. అలాంటి సంఘ‌ట‌నే ఇప్పుడ దేశ రాజ‌కీయాల్లో చోటు చేసుకుంది.

దీనికి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకుంటే….మిత్రులుగా ఉన్న భాజాపా, టీడీపీ శ‌త్రువుల‌య్యారు….మొన్నటిదాకా ఉప్పూనిప్పుగా ఉన్న కాంగ్రెస్‌, టీడీపీలు ఇప్పుడు మిత్రులుగా మారారు. త‌మ స్వార్థ రాజ‌కీయాల‌కోసం పొత్తులు పెట్టుకుంటూ…దేశ ప్ర‌యోజ‌నాల‌కోస‌మే పొత్తు పెట్టుకుంటున్నామ‌ని క‌ప్పు పుచ్చుకొనే ప్ర‌య‌త్నం చేస్తుంటారు.

తెలంగాణా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఖ‌మ్మంలో నిర్వ‌హిస్తున్న మ‌హాకూట‌మి బ‌హిరంగ సంద‌ర్భంగా రాజ‌కీయాల్లో స‌రికొత్త ఘ‌ట్టానికి తెర‌లేచింది. బ‌ద్ద‌శ‌తృవులుగా ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు ఒకే వేదికపై ఆశీనులయ్యారు. పక్కపక్కనే కూర్చుని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐలు పీపుల్స్ ఫ్రంట్ గా ఏర్పడ్డాయి. ఈ కూటమి ఉమ్మడి ఎన్నికల ప్రచారసభ ఖమ్మంలో బుధవారం నాడు జరిగింది. ఈ వేదికపై అతిరథ మహరథులు పాల్గొన్నారు. టీఆర్ఎస్‌ వ్యతిరేక పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తో కలిసి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కలిసి వేదికను పంచుకోవడం ఇదే ప్రథమం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -