Thursday, March 28, 2024
- Advertisement -

బాబుకు దిమ్మతిరిగే షాక్…….. వైకాపాలోకి టిడిపి విప్

- Advertisement -

టిడిపి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వైకాపాలో చేరనున్నాడా? చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ తగలనుందా అంటే అవునని అంటున్నాయి ఎల్లో మీడియా వర్గాలు. చంద్రబాబు సొంత మీడియాలోనే టిడిపి విప్ త్వరలోనే వైకాపాలో చేరనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావడం కల్ల అని ఫీలవుతున్న పారిశ్రామికవేత్తలు, కొంతమంది టిడిపి నాయకులు లోపాయికారిగా జగన్‌కి జై కొట్టడానికి రెడీ అయిపోయారన్న వార్తలతో చంద్రబాబు ఓ రేంజ్‌లో టెన్షన్ పడుతున్నాడు. ఇప్పుడిక అధికార పార్టీలో ఎమ్మెల్యే స్థాయి పదవుల్లో ఉన్నవారు వైకాపాలో చేరితే మాత్రం ఎన్నికల ముందే చంద్రబాబు చేతులెత్తేయాల్సిన పరిస్థితులు వస్తాయనడంలో సందేహం లేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కడపలో వైకాపాను ఓడిస్తాం. పులివెందులలో జగన్‌ని దెబ్బకొడతాం అని డప్పాలు కొడుతున్న టిడిపి నాయకులకు దిమ్మతిరిగే షాక్. టిడిపి విప్, కడప జిల్లా, రాజంపేట ఎమ్మెల్యే అయిన మేడా వెంకట మల్లికార్జునరెడ్డి త్వరలోనే వైకాపాలో చేరనున్నాడనే వార్తలు చంద్రబాబుతో సహా టిడిపి ముఖ్యనాయకుల్లో ఆందోళన పెంచుతున్నాయి. ఈ చేరికకు సంబంధించిన వార్తలు స్వయంగా బాబు భజన మీడియాలో నంబర్ ఒన్ అయిన తోకపత్రికలోనే వస్తున్నాయి. పైగా ఆ ఎమ్మెల్యే కూడా వైకాపాలో చేరిక వార్తలను ఖండించకుండా పార్టీ మారేలా ఉంటే స్వయంగా చంద్రబాబుకు చెప్పే మారతానని, భయపడనని బహిరంగంగానే చెప్తూ ఉండడం టిడిపి నాయకుల్లో చర్చనీయాంశం అవుతోంది. రెండు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే గెలుపుపై నమ్మకం లేక పార్టీని వీడి ప్రతిపక్ష వైకాపాలో చేరితే మాత్రం అది చంద్రబాబుకు చావుదెబ్బే అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. గెలుపుపై టిడిపి శ్రేణులతో పాటు, ముఖ్యనాయకులు కూడా నమ్మకం కోల్పోయే పరిణామంగా విశ్లేషకులు తేల్చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -