Saturday, April 20, 2024
- Advertisement -

చంద్రబాబూ.. హిస్టరీ రిపీట్.. వర్మ సెటైర్లు..

- Advertisement -

చంద్రబాబును నిన్ను వదల బొమ్మాళీ అంటూ వెంటబడుతున్నాడు టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. సమయం దొరికితే చాలు ట్విట్టర్ లో ఆడుకుంటున్నారు. తాజాగా టీడీపీ సంక్షోభాన్ని కూడా రాంగోపాల్ వర్మ తనకు అనువుగా మలుచుకున్నాడు.

రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విసుర్లు కురిపించారు.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి పురుడు పోస్తే.. చంద్రబాబు నాయకుడు దాన్ని చంపేస్తున్నాడని కామెంట్ చేశాడు. ఇక టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడంపై కూడా చరిత్ర పునరావృతం అయ్యిందంటూ వర్మ ఎద్దేవా చేశారు.

నాడు ఎన్టీఆర్ వైద్య చికిత్సల పేరిట అమెరికా వెళితే.. నాదెండ్ల భాస్కర్ రావు టీడీపీని లాగేసుకొని సంక్షోభంలోకి నెట్టాడని.. ఇప్పుడు చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళితే టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరారని.. చరిత్ర మరోసారి పునరావృతం అయ్యింది బాబు అంటూ సెటైర్లు వేశారు వర్మ.

ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతుంటే ఆయన డైలాగులకు నవ్వుతున్న జగన్ కు ‘బాబులో బ్రాహ్మనందం కనిపిస్తున్నాడేమోనని’ వర్మ సెటైర్లు వేశారు. అసెంబ్లీలో బాబు బ్రహ్మానందమేనని ఎద్దేవా చేశారు.

ఇలా ట్విట్టర్ వేదికగా సమయం వస్తే చాలు వర్మ చంద్రబాబుపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -