పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు.. ఎవరి నుంచో తెలుసా ?

1564
Rapaka Backstabbing Pawan kalyan
Rapaka Backstabbing Pawan kalyan

ఏపీ రాజకీయాలో జనసేన పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో మంచి క్రేజ్ ఉన్న.. ఓట్లు మాత్రం పడలేదు. అందుకే రాజకీయాలో పవన్ విఫలం అయ్యాడు. అయితే జనసేనలో గెలిచింది ఒకే ఒక్కరు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. పవన్ కళ్యాణ్ రెండు చోట్లా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. రాపాక ద్వారా అసెంబ్లీలో అధికార పక్షానికి తమ సత్తా చూపిస్తాం అని రెచ్చిపోయారు జనసైనికులు. కానీ రాపాక మాత్రం వైసీపీ పై విమర్శలు చేయడం జరగడం లేదు.

మొదటి నుండి రాపాక…. తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదు అని పదే పదే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. నిజానికి రాపాక పై అధికార పార్టీ అడ్డగోలు కేసులతో వేధింపులకు పాల్పడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించారు. తానే స్వయంగా దిగాల్సి వస్తుందని హెచ్చరించగా అప్పుడు రాపాక దాని నుంది బయట పడ్డాడు. ఆ తర్వాత రాపాక భయపడ్డాడో ఏమో కానీ అధికార పార్టీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. ఆయన ఎన్ని చేసిన సరే పవన్ మాత్రం బహిరంగా ఇప్పటివరకు అతనిపై విమర్శలు చేయలేదు. అయితే తాజాగా రాపాక కు సంబంధించిన ఒక వీడియో వెలుగుచూసింది.

కొన్ని కారణాల వల్ల వైసీపీలో మంచి ఛాన్స్ దక్కించుకోలేకపోయానని.. అందుకే జనసేనలో చేరానని.. జనసేన నుంచి గెలిచిన వెంటనే జగన్ ను కలిస్తే.. ’కలిసి పనిచేద్దాం’ అని జగన్ చెప్పారని.. అప్పటి నుంచి తాను వైసీపీ నేతగా చేలామణీ అవుతున్నానని వీడియోలో చెప్పారు. రాపాక చెప్పింది నిజమైతే అతను చేస్తున్న పనికి ’నమ్మకద్రోహం’ ’వెన్నుపోటు’ అనే మాటలు చాలా చిన్నవి అని జనసైనికులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇది సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎలాంటి వెన్నుపోటు చూశాడో.. అలాంటిదే పవన్ కు రాపాక నుంచి వెన్ను పోటు తగిలిందని అని ఫ్యాన్స్ అంటున్నారు.

Loading...