Thursday, April 25, 2024
- Advertisement -

రోజా సైలెంట్‌కు కార‌ణం ఏంటి…. గెలిస్తే చ‌రిత్రే….?

- Advertisement -

వైసీపీ ఎమ్మెల్యే రోజా గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. పార్టీ ఫైర్‌బ్రాండ్‌గా పార్టీలో ముద్ర‌ప‌డింది. త‌న మాట తూటాల‌తో అధిరాపార్టీ టీడీపీ నేత‌ల‌కు చుక్క‌లు చూపించ‌డంలో ముందుంటుంది. రాజ‌కీయాల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకొనేందుకు మొద‌ట టీడీపీలో చేరింది. ప‌ది సంవ‌త్స‌రాల పాటు టీడీపీలో ఉన్నా రోజాకు ఎమ్మెల్యేగా బ్రేక్ రాలేదు.2004లో న‌గ‌రి, 2009లో చంద్ర‌గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన రోజా 2009లో ఓట‌మి త‌ర్వాత వైఎస్ బ‌తికి ఉండ‌గానే కాంగ్రెస్‌లోకి గోడ దూకేసింది.

వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత వైఎస్ఆర్‌సీలో రోజా అంకిత భావంతో ప‌నిచేయ‌డంతో 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ న‌గ‌రి సీటును ఇచ్చారు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ స్వ‌ల్ప ఓట్ల తేడాతో అధికారం కోల్పోయినా రోజా మాత్రం ఎమ్మెల్యేగా గెలిచింది.ఈ ఐదేళ్ల పాటు పార్టీ కోసం టీడీపీపై ఎన్నో పోరాటాలు చేసింది. చివ‌ర‌కు యేడాది పాటు అసెంబ్లీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యింది.

రోజా పార్టీ కోసం ఎంతో చేసినా అదే ఇప్పుడు ఆమెకు అటు ప్ర‌త్య‌ర్థి పార్టీ అయిన టీడీపీలోనే కాకుండా… ఇటు విప‌క్ష పార్టీలోనూ శ‌త్రువుల‌ను పెంచుకున్న‌ద‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. అది కూడా రోజానె సొంతంగా చేసుకున్న‌దే. వైసీపీ అధికారంలోకి వ‌స్తె రోజాకు జ‌గ‌న్ హోంమంత్రి ప‌ద‌విని ఇవ్వ‌డం ఖాయం అనే టాక్ పార్టీలో బ‌లంగా వినిపించింది. ఈ టాక్ ఎన్నిక‌ల ముందు నెంచే టాక్ బాగా పాపుల‌ర్ అయ్యింది. ఇక సోష‌ల్ మీడియాలోనూ, ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లోను బాగా హైలెట్ అయ్యింది. ఇదే రోజాకు ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతోంది.

ఈ విష‌యాన్ని ముందుగానె పసిగ‌ట్టిన జిల్లా నేత‌లు రోజాకు చెక్ పెట్టేందుకు పావులు క‌దిపిన‌ట్లు స‌మాచారం. రోజాను సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఓడించేందుకు తెర‌వెన‌క గోతులు తీసిన‌ట్టు తెలుస్తోంది. ఒక్క జిల్లా నుంచే రోజా సొంత సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు ఏకంగా న‌లుగురు వ‌ర‌కు మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్నారు. వీరిలో కొంద‌రు నేత‌లు రోజా గెలిస్తే రేపు మంత్రి ప‌ద‌వి రేసులో త‌మ‌కు పోటీ వ‌స్తుంద‌ని ఆమె ప్ర‌త్య‌ర్థి వ‌ర్గానికి స‌హ‌క‌రించిన‌ట్లు తెలుస్తోంది. పోలింగ్ స‌మ‌యంలో పార్టీలోని కొంద‌రి నేత‌ల‌ను సైలెంట్ అయ్యేలా చ‌క్రం తిప్పిన‌ట్టు జిల్లాలో చ‌ర్చ‌లు జోరుగా న‌డుస్తున్నాయి.

మ‌రో సారి న‌గ‌రినుంచి రోజా ఎమ్మెల్యేగా గెలుస్తుంద‌నె టాక్ వినిపించింది. దీంతో ఆమె ఓట‌మికి ఎన్నిక‌ల్లో త‌మ వంతుగా తెర‌వెన‌క చ‌క్రం తిప్పిన‌ట్టు టాక్‌. రోజా మాత్రం ఎన్నిక‌ల్లో గెలుపు కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డారు. నియోజ‌క వ‌ర్గంలోనె ఇళ్లు నిర్మించుకొని ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నారు. వైఎస్సార్ క్యాంటిన్ల ఏర్పాటు ద్వారా ప్ర‌జ‌ల్లోకి బాగా చొచ్చుకుపోయారు. ఇలాంటి ఎత్తుల‌నుచిత్తు చేసి రోజా గెలిచి.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే రోజా చ‌రిత్ర సృష్టించిన‌ట్టే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -