వైవీ సుబ్బారెడ్డిని తప్పించడం వెనుక కారణమేంటి?

1426
Reason behind Shock to YV Subba Reddy
Reason behind Shock to YV Subba Reddy

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం విషయంలో వైసీపీ అధ్యక్ఝులు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా ముందు చూపుతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజలకు అన్ని విధాలా సంక్షేమ పథకాలతో ముందుకు వెళుతూ మరో వైపు పార్టీ బలోపేతం కోసం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సమర్థవంతమైన నాయకులకు మాత్రమే బాధ్యతలు అప్పగిస్తున్నారు.

ఆయా జిల్లాలను సమన్వయం చేస్తూ పార్టీ బలోపతం చేసే వారికే ఆ బాధ్యతలను అప్పజెప్పుతున్నారు. ఈ నేపథ్యంలో తన పర బేధం లేకుండా.. తనకు బంధువులైనా సరే మార్చుతున్నారని తాజాగా ఘటనతో నిరూపితమైంది.

తాజాగా వైసీపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఈ ప్రకటనతో జగన్ పార్టీ విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో తేటతెల్లమైంది. ‘‘వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి పార్టీ అధ్యక్షుడు వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి పలు నిర్ణయాలు తీసుకున్నారు. దీంట్లో భాగంగా ఇక మీదట కృష్ణ మరియు గుంటూరు జిల్లాల బాధ్యతలను మోపిదేవి వెంకటరమణ గారికి అప్పగించాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయి.’’ అన్నది ఈ ప్రకటన సారాంశం.

ఇటీవలే వైఎస్ జగన్ గుంటూరు, కృష్ణ జిల్లాల బాధ్యతలను దగ్గరి బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారు. కానీ కొద్దిరోజులకే వైవీ సుబ్బారెడ్డి స్థానంలో మోపిదేవికి ఆ రెండు జిల్లాలను కేటాయించడం నిజంగానే వైవీకి గట్టి షాక్ గా పార్టీలో చర్చ జరుగుతోంది. జగన్ కు దగ్గర బంధువు అయినా వైవీకి ఇది నిజంగానే షాకింగ్ ప్రకటన అంటున్నారు.

గతంలో ఇలానే సజ్జల రామకృష్ణ రెడ్డికి వైఎస్ జగన్ షాక్ ఇచ్చారు. వారానికే తన రెండు జిల్లాలను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇచ్చి సజ్జలను పక్కనపెట్టారు. తాజాగా మరోసారి జిల్లాల బాధ్యతల నుంచి తప్పించడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Loading...