మూడు రాజ‌ధానులు.. నాలుగు జోన్లు.. 25 జిల్లాలు.. జ‌గ‌న్ పాలన అదరహో..!

- Advertisement -

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన పాలనా వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ అంశంలో జగన్ సర్కార్ స్పీడ్ గా దూసుకెళ్తోంది. మూడు రాజధానుల విషయంతో పాటు.. రీజనల్ డెవలప్మెంట్ జోన్లు కూడా ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీని 4 జోన్లుగా చూడాలని, ఆయా జోన్లలో ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని ఇదివరకే జీఎన్ రావు కమిటీ సూచించింది. అన్ని జిల్లాలు కలిపి మొత్తం నాలుగు జోన్లుగా విభజిస్తారు. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడపలను జోనల్ కేంద్రాలుగా గుర్తించబోతున్నారు.

అయితే ఏపీలో ఏర్పాడే జోన్లకు వేటకవే ప్రత్యేకంగా నిలబడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితుల దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ వేర్వేరు వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. ఉదాహరణకు విజయనగరం జోన్ పరిధిలోకి వచ్చే కొత్త రాజధాని విశాఖలో ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రాధ్యానం ఇవ్వనుండగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మైనింగ్, గిరిజన సంక్షేమానికి సంబంధించి కార్యలయాలు ఏర్పాటు చేయనున్నారు. కాకినాడ జోన్ లో ఆక్వా, వ్యవసాయ రంగాలకు.. గుంటూరు జోన్ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పోర్టులు, ఎంఎస్ఎంఈలు.. కడప జోన్ లో హార్టికల్చర్, చిరుధాన్యాల బోర్డు, ఇతర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది.

- Advertisement -

ఇక ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న నాలుగు జోన్ల పర్యవేక్షణ కోసం భారీ సెటప్ ను రూపొందిస్తుంది ఏపీ సర్కార్. బోర్డు పరిధిలో చైర్మన్ తో పాటు ఏడుగురు సభ్యులు ఉండేలా.. ఆ జోన్ల చైర్మన్లకు కేబినేట్ ర్యాంక్ హోదా కూడా కల్పించబోతున్నారని తెలుస్తోంది. మంత్రి పదవితో సమానంగా జోన్ల చైర్మన్లను ట్రీట్ చేయనున్నారని సమాచారం. మంత్రి పదవులు చివరి నిమిషంలో కోల్పోయిన వారికి.. జగన్ మాట ఇచ్చిన వారికి ఈ పదవులు దక్కే అవకాశం ఉందట. అలానే ఏపీలో కొత్తగా జిల్లాలు ఏర్పాటు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ రంకంగా ఏపీలో ప్రజలకు అన్ని విధాలుగా లాభం కలిగేలా జగన సర్కార్ ముందుకు వెళ్తుంది.

సీఎం జగన్ ను ఎప్పుడు విమర్శలు చేస్తూ.. మూడు రాజధానుల విషయంలో తీవ్రంగా అడ్డుపడ్డారు చాలా మంది. అయితే.. గ‌వ‌ర్న‌ర్ ఆమోదాన్ని కూడా కొంద‌రు నేత‌లు, మీడియా చానెళ్లు కూడా తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నాయి. రాజ‌ధాని బిల్లును తిప్పిపంప‌లేద‌ని జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ కానీ, వైసీపీ నేతలు కూడా ఎక్కడ కామెంట్స్ చేయలేదు. జ‌గ‌న్ ఈజ్ బెస్ట్ సీఎం.. ఏపీకి మూడు రాజ‌ధానులు ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. విభిన్న‌మైన భౌగోళిక అంశాలు ముడిప‌డిన రాష్ట్రానికి మూడు రాజ‌ధానుల‌తో ప్ర‌యోజ‌నం ద‌క్కుతుంద‌ని పేర్కొంటూ.. ఏకంగా బ్రిట‌న్ నుంచి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది.

రాజ‌ధానుల బిల్లును గ‌వ‌ర్న‌ర్ ఆమోదించిన విష‌యం తెలిసిన అనంత‌రం.. తెలుగు రాష్ట్రాల‌ బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ప్లెమింగ్ స్వాగ‌తిస్తూ గొప్ప ప‌రిణామంగా కొనియాడారు. ఏది ఏమైన.. జగన్ వేసిన వ్యూహాలు ఎవరికి అంతుచిక్కడం లేదు. ప్రతి అడుగు ప్రజలకోసమే అన్నట్లు జగన్ ముందుకు వెళ్తున్నారు. జగన్ వేళ్తున్న తీరు చూసి టీడీపీ, జనసేన, బీజీపీ నేతలకు కళ్ళు తిరిగుతున్నాయి. ఏది ఏమైన జగన్ ది బెస్ట్ సీఎం అనిపించుకున్నారు.

జగన్ తన వ్యూహాలతో బాబును తికమక పెట్టాడు.. ?

జగన్ కమిట్మెంట్ చూసి షాక్ అయ్యా.. కానీ మోసం : రఘురామ

రైతుకు ట్రాక్టర్‌.. చంద్రబాబు రాజకీయం.. ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ..!

ప్రైవేట్ హాస్పిటల్ లో.. కరోనా చికిత్సకు 10 రోజుల 17.5లక్షల బిల్లు..!

Most Popular

సోహెల్ నటించిన సినిమాలు, సీరియల్స్ ఇవే..!

సోహెల్ బిగ్ బాస్ నాలుగో సీజన్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. హౌస్ లో కాస్త కోపంగా కనిపించినా సోహెల్.. ఇప్పుడు చాలా ఇస్మార్ట్ గా గేమ్ ఆడుతున్నాడు. సోహెల్...

నా బెస్ట్‌ఫ్రెండ్‌ ట్రాన్స్‌జెండర్ : ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల చాలా పెద్ద సెలబ్రిటీ అయినప్పటికి.. మాములు వ్యక్తిలా ఉంటూ అందర్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. తన భర్తకు సంబంధించిన అప్...

హాస్పిటలో ఉన్న రాజశేఖర్ కోసం చిరు ఏం చేశారంటే ?

ఇటీవలే హీరో రాజశేఖర్ కరోనా బారిన పడ్డారు. మా తండ్రి కండిషన్ క్రిటికల్ గా ఉంది.. అందరు ప్రార్ధించండి అని రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఓ లేఖ రాశారు. ఆ...

Related Articles

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

ఏడాదిన్నర వైసీపీ పాలనలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని… రైతు రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు టీడీపీ నేత నారా లోకేశ్. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు...

ఏపీ పోలీసు శాఖకు 103 అవార్డులు

ఏడాది కాలంలో ఏపీ పోలీసు శాఖకు 103 అవార్డులు రావడం సంతోషంగా ఉందని, దేశంలోనే ఏపీ పోలీసుల మెరుగైన సేవలకు అవార్డులే నిదర్శనమని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు....

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేస్తూ వచ్చింది కూడా ఇదే. చంద్రబాబు వ్యవస్థను బాగా మేనేజ్ చేస్తారని మొదటి...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...