Friday, April 26, 2024
- Advertisement -

ఆ ఇద్దరి లో ఒకరికి ఇవ్వకుంటే టీడీపీ కొలాప్స్..?

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లేవని చెప్పాలి.. ఏ రాష్త్రంలోనూ ముఖ్యమంత్రి ని ఇంతలా ఏ ప్రతిపక్షాలు టార్గెట్ చేయలేదు.. ప్రతి విషయంలో అధికార ప్రభుత్వాన్ని నిందిస్తూ, కోర్టు లో కేసులు వేసి గెలుస్తూ , అసలు ప్రభుత్వంలో ఉన్నది టీడీపీ నా, వైసీపీ నా అన్నది తెలీకుండా టీడీపీ ప్రవర్తిస్తుంది.. ఓ వైపు నేతలు జైలుకు వెళుతున్నా ఏమాత్రం తగ్గకుండా వైసీపీ ని విమర్శలపాలు చేస్తూ గుదిబండలా తయారైంది.. ఇక అమరావతి భూముల విషయం లో అయితే జగన్ ఎంత బ్యాడ్ చేయాలో అంత చేసేసింది టీడీపీ.

దీంతో మొన్నటివరకు చంద్రబాబు విలన్ గా కనిపించగా ఈ దెబ్బతో పార్టీ లో కొత్త ఉత్సాహం ఉరకలువేస్తోంది. అయితే ఇన్ని జరుగుతున్న టీడీపీ నుంచి వైసీపీ లోకి చేరికలు మాత్రం ఆగట్లేదు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీ లోకి డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా చేరి వైసీపీ కండువా కప్పుకున్నారు నేతలు.  ఇక విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం ఒక ప్రత్యేకమైనది. ఇక్కడ మొదట్లో టీడీపీ ప్రభంజనమే సాగింది. గిరిజన దొర అయిన భంజ్ దేవ్ వరసగా గెలిచారు. 2004 తర్వాత  కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజన్నదొర ఇప్పటికి దశాబ్దన్నర కాలంగా పట్టు బిగించేశారు.

అయితే చంద్రబాబు  భంజ్ దేవ్ ని ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు.. పార్టీ ఉనికి కోల్పోకూడదని అయన అక్కడ భంజ్ దేవ్ కి ప్రత్యామ్నాయం చూశారు.. టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ని వచ్చే సారి ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.. అయితే ఏరికోరి గుమ్మడి సంధ్యారాణి ని ఎంపిక చేసినా ఆమెకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వట్లేదన్నది అక్కడి తమ్ముళ్ల ఆవేదన.. సాలూరు టీడీపీ ఇంచార్జి పదవి కావాలని ఆమె నేరుగా అభ్యర్ధించినా కూడా టీడీపీ అధినాయకత్వం అసలు పట్టించుకోలేదు. మరో వైపు భంజదేవ్ వర్గానికి కూడా నిరాశ కలిగించేలా టీడీపీ అధినాయకత్వం నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ఇద్దరిలో ఎవరికీ ఇవ్వాలో తెలీక టీడీపీ అక్కడి ఇంచార్జి పదవికి ఖాళీగా ఉంచారని టాక్. మరి చంద్రబాబు కొత్త ముఖాన్ని తీసుకొస్తారా లేదా ఇద్దరి లో ఎవరికీ ఈ ఇంచార్జి పదవి ఇస్తారా అన్నది చూడాలి..

జంపింగ్ జపాంగ్‌లను పక్కన పెట్టిన బాబు..!

ఏలూరి కి పెద్ద టాస్క్.. టీడీపీ ని బలపరిచేనా..?

అప్పుడు ప్రతీకారం.. ఇప్పుడు భజన.. ఏదైనా బాబు..బాబే..!

టీడీపీ కి వారే శత్రువులుగా మారుతున్నారా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -