వారి ఖాతాల్లో రూ.5వేలు : కేసీఆర్ గిఫ్ట్

2021
Salute you for relentless efforts KCR gifts incentive to civic staff
Salute you for relentless efforts KCR gifts incentive to civic staff

కరోనా వైరస్ వల్ల దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లింది. దాంతో ప్రజలందరు ప్రభ్యుత్వం చెప్పినట్లుగానే ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. దీంతో రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వాలు కూడా కరోనా ను తరిమికొట్టేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు మాత్రం నిరంతరం శ్రమిస్తున్నారు.

రోడ్లను ఊడుస్తూ – వీధులను – గల్లీలను శుభ్రం చేస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పక్కగా అమలు చేస్తున్నారు. వారి కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి ప్రోత్సాహకం అందిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. వారికి చేతులెత్తి దండం పెట్టిన సీఎం.. జీహెచ్ ఎంసీ – హెచ్ ఎండబ్ల్యూఎస్ డబ్ల్యూలో పనిచేస్తున్న వారికి రూ.7500 – గ్రామపంచాయతీలు – మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న వారికి రూ.5వేలు ఇస్తానని చెప్పారు. అన్నట్లుగానే సీఎం స్పెషల్ ఇన్సెంటివ్ నిధులు విడుదలయ్యాయి. ప్రతి కార్మికుడి ఖాతాల్లోకి నేటి నుంచి రూ.5వేలు జమకానున్నాయి.

అందుకోసం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.21.84 కోట్లు విడుదల చేసింది. గ్రామ పంచాయతీల్లో సఫాయి కర్మచారులు 43661 మంది – మునిసి పాలిటీల్లో 21531మంది – హైదరాబాద్ వాటర్ వర్క్స్ అండ్ సేవరేజ్ బోర్డులో 2510 జీహెచ్ ఎంసీలో 20690 మంది.. మొత్తం 95392 మంది పనిచేస్తున్నారు. వారందరికీ ఈ సీఎం గిఫ్ట్ అందనుంది. వారి జీతాల్లోనూ కోత పెట్టకుండా చర్యలు తీసుకున్నారు. దీనితో కాస్త సమయంలో కూడా తమ కష్టాన్ని గుర్తించి సాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Loading...