చంద్రబాబు మరొకసారి బుద్ధి చెప్పాలా..?

381
Should people once again say buddhi to Chandrababu's greed
Should people once again say buddhi to Chandrababu's greed

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కి ప్రజలు ఈ ఎన్నికల్లో అంత దారుణంగా ఓడించినా కూడా ఆయనకు కొంతైనా బాధ్యత లేకుండా వ్యవహరించడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తుంది.. ప్రజల తీర్పును ఆయన గౌరవించకుండా అధికారంలోకి వచ్చిన జగన్ ను ఎప్పుడూ విమర్శిస్తూ ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందా అని ఎదురుచూస్తున్నాడు.. ఇప్పటికే పడిపోయిన పార్టీ ని చక్కదిద్దుకోవాల్సింది పోయి వయసు, అనుభవం, సీనియారిటీ అన్ని ఉంది కూడా ఇలా చేస్తుండడం ప్రజలకు ఏమాత్రం నచ్చడం లేదు..

ఇక బీజేపీ తో ఇటీవలే జరిగిన అత్యంత సాదా సీదా విషయమై టీడీపీ నేతలు ఒకటే గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టారు.. అమిత్ షా ఇటీవలే అనారోగ్యం నుండి కోలుకుని ఇంటికి తిరిగి రాగ ఆయనకు చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు.. దీంతోనే టీడీపీకి, తమ్ముళ్లకూ పూనకాలు వచ్చేస్తున్నాయి… అనుకూల మీడియా అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ తో పొత్తు ఉండడం ఖాయం.. ఇక వైసీపీ కి ఓటమి మిగిలుంది అనే రేంజ్ లో చెప్పుకోవడం వారికే చెల్లింది.. అయితే ఇక్కడే అసలు పాయింట్ మర్చిపోతున్నారు చంద్రబాబు..

ఇప్పటివరకు ప్రతిపక్షంలో ఉంది చంద్రబాబు ఏం చేశారో అర్థం కావట్లేదు.. పొద్దున్న లేస్తే ట్విట్టర్ లో జగన్ ను , వైసీపీ ని విమర్శించడమే తప్ప్ప కరోనా ఆపద సమయంలో కనీసం ప్రజలకు సేవ చేసిన పాపాన పోలేదు.. జగన్ తప్పులు చేస్తే ఆ వ్యతిరేక ఓటు తనకు అనుకూలంగా మారి గెలిచేస్తానని, ఏపీ జనాలకు తన కంటే మంచి పాలకుడు లేడని చంద్రబాబు మొండి నమ్మకం. మరోవైపు చంద్రబాబు ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే జగన్ ఇంటికి వెళ్ళిపోతాడూ పీఠం తనదేనని ధీమాగా ఎందుకు చెబుతున్నారో అర్థం కావట్లేదు. ఉన్న 23 సీట్లు ఊడిపోయే దాకా చంద్రబాబు కు ఇదే అధికారం పిచ్చి తగ్గుతుందేమోనన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు. ఇక చంద్రబాబు ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో తెలుగు తమ్ముళ్లు మాత్రం పెద్ద జోకర్ లు గా షో ని చూస్తున్నారు..

Loading...