Wednesday, April 17, 2024
- Advertisement -

సోము వీర్రాజు వేసిన ఈ వ్యూహం ప్రజలు అంగీకరించేనా…?

- Advertisement -

రాష్ట్రంలో మూడు రాజధానుల చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అన్ని పార్టీ లు ఇంకా ఈ విషయం పై తన వైఖరి ని మార్చుకోకుండా అలానే ఉన్నాయి.. వైసీపీ విశాఖ కి రాజధాని ని మర్చి ధృడ సంకల్పం తో ఉండగా టీడీపీ మాత్రం మొండి ప్రాతం చేస్తూనే ఉంది.. ఇక ఈ విషయంలో బీజేపీ రెండు సధోరణుల వ్యవహారం ఎవరికీ అర్థం కావడం లేదు..  వైసీపీ రాజధాని ని మార్చాలని నిర్ణయం తో ఉండగా, టీడీపీ దాన్ని అడ్డుకోవాలని ధృడ సంకల్పం తో ఉంది. ఎటొచ్చి బీజేపీ పార్టీ ఎటు క్లారిటీ ఇవ్వకుండా ఉంది.. కేంద్రం లోని బీజేపీ పార్టీ మూడు రాజధానులకు సానుకూలంగా ఉంటే రాష్ట్రంలోని బీజేపీ పార్టీ వ్యతిరేకంగా ఉంటుంది..

దాంతో ఎటువైపు ఉండాలో రాష్ట్ర బీజేపీ పార్టీ కి కూడా అర్థం కానీ పరిస్థితి.. రాష్ట్రంలో పార్టీ ని పుంజుకునేలా చేయడానికి నేతలందరూ కష్టపడిపోతుంటే కేంద్రం ఇలా రాష్ట్ర బీజేపీ కి వ్యతిరేకమైన పనులు చేయడం వారికీ కొంత ఇబ్బంది కలిగిస్తుందట.. గతంలో బీజేపీ అధ్య‌క్షుడుగా ఉన్న క‌న్యా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా టీడీపీకి వంత పాడుతూ మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా లేఖ రాశారు. అయిన‌ప్ప‌టికీ న్యాయ స‌ల‌హాలు తీసుకుని సుదీర్ఘంగా చ‌ర్చించిన గ‌వ‌ర్న‌ర్ మూడు రాజ‌ధానుల బిల్లుకు ఆమోద ముద్ర వేసిన సంగ‌తి తెలి‌సిందే. అయితే ఆ గవర్నర్ కూడా కేంద్ర బీజేపీ తో సలహా తోనే ఆమోదముద్ర వేశాడని వార్తలు బయటకి వచ్చాయి..

అయితే తాజాగా కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జరిగిన గతాన్ని మనసులో పెట్టుకోకుండా ఓ కొత్త వ్యూహంతో ఈ అంశంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నాడట..  ఇప్పటికే తన పార్టీ నేతలతో ఈ విషయం పై చర్చించారట.. చంద్రబాబు తరహాలో ఆ ప్రాంతపు వాడిలాగా వెళ్లి అమరావతి పై ప్రజలతో చర్చించడంకాకుండా అన్ని ప్రాంతాలు హర్షించేలా అమరావతి ఇష్యూ ని పరిష్కరించాలని డిసైడ్ అయ్యారట.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంత సమస్యలను కూడా అంశాల‌పై దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించింది. మ‌రి ఎంత వ‌ర‌కు త‌మ ప్ర‌య‌త్నాల్లో బీజేపీ స‌ఫ‌లం అవుతుందో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -