రైతుకు ట్రాక్టర్‌.. చంద్రబాబు రాజకీయం.. ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ..!

1136
Sonu Sood Tractor Gift lands Former in trouble
Sonu Sood Tractor Gift lands Former in trouble

చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ఓ టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తునాడు. కరోనా కారణంగా సొంతూరైన పీలేరుకు వచ్చేశాడు. తనకున్న రెండు ఎకరాల పొలంలో వేరుశనగ, టమోట పంట వేసేందుకు సిద్దమయ్యాడు. అయితే ఉన్న డబ్బుతో కొంత పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నించారు. డబ్బులు అయిపోవడంతో మిగిలిన పొలాన్ని తన కుమార్తెలను కాడెద్దులగా మార్చి దున్నేశారు. కుమార్తెలు కాడెద్దులుగా ఉన్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అవి కాస్త నటుడు సోనూసూద్ కంట పడ్డాయి. వారికి ఎలాగైన సాయం చేయాలని సోను అనుకుని తొలుత ఎద్దులు పంపుతానని అన్నారు. తర్వాత కుటుంబ సభ్యుల విన్నపం మేరకు ట్రాక్టర్‌ ఇస్తున్నట్లు ట్వీట్‌ చేసి… మూడు గంటల వ్యవధిలోనే రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్‌ పంపించేశాడు. ఈ విషయం అధికార, ప్రతిపక్ష పార్టీలు తెలుసుకునే లోపే పబ్లిసిటీ వచ్చింది. ఈ విషయంపై వెంటనే స్పందించిన చంద్రబాబు.. ఆ రైతు పిల్లల చదువుకు అయ్యే ఖర్చు తాను భరిస్తానని ప్రకటించారు.

ఇదే ఛాన్స్ గా తీసుకున్న టీడీపీ శ్రేణులు.. రైతు నాగేశ్వరరావుకు ప్రభుత్వ పథకాల సాయం అందలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దాంతో వైసీపీ సోషల్‌ మీడియా వింగ్‌ అలర్ట్‌ అయ్యింది. ఈ నాగశ్వరరావు ఎవరు అన్నది ఆరా తీసింది. దాంతో రైతుగా నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నివిధాలుగా లబ్ధి పొందినట్లు గుర్తించారు. ఆయన రైతు భరోసా కింద గత ఏడాది 13 వేల 500 అందుకున్నారని.. ఈ ఏడాది ఇప్పటి వరకూ 7 వేల 500 తీసుకున్నారని తెలుసుకున్నారు. చిన్న కూతురు అమ్మఒడి కింద జనవరిలో 15వేలు, నాగేశ్వరరావు తల్లిదండ్రులు వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. కరోనా టైంలో వెయ్యి రూపాయలు, రెండెకరాల పొలంలో వేరుశనగ వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి DAP ఎరువు, విత్తనాలు పొందినట్లు సోషల్‌ మీడియా ద్వారా బయటపెట్టారు.

అయితే ట్రాక్టర్ రానంత వరకు సైలెంట్ ఉన్నవారు ఒక్కసారిగా విమర్శలు చేయడానికి కారణం చంద్రబాబే అని టాక్ వినపడుతోంది. సోనూ సూద్ ట్రాక్టర్ పంపిన తర్వాత చంద్రబాబు జోక్యం చేసుకోవడం చర్చకు దారి తీసిందట. ఆ రైతుకు ప్రభుత్వం ఏమి చేయలేదని టీడీపీ నేతలు రెచ్చిపోవడంతో వైసీపీ సీరియస్ గా తీసుకుని నాగేశ్వరరావు గురించి ఆరా తీసి మొత్తం బయటపెట్టేసింది. అయితే ట్రాక్టర్ ను వెనక్కి ఇస్తున్నట్లు నాగేశ్వరరావు చెప్పినట్లు ప్రతిపక్షలు అస్త్రంగా చేసుకుని ట్రోల్స్ మొదలు అయ్యాయి. అయితే నాగేశ్వరరావు మాత్రం ట్రాక్టర్‌ వెనక్కి ఇవ్వట్లేదని చెప్పాడు. అలా టీడీపీ నేతల ఓవరాక్షన్ ఆ రైతుకు ట్రాక్టర్ దక్కకుండా చేశాలా ఉన్నారన్న చర్చ మొదలైంది.

సీఎం జగన్ ను ఫిదా చేస్తున్న దేవినేని అవినాష్..!

ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి రావడం బాలయ్య ఫ్యామిలీకి ఇష్టం లేదా ?

విజయసాయిరెడ్డికి గంటా ఇలా షాక్ ఇవ్వనున్నాడా ?

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్..!

Loading...