Thursday, April 25, 2024
- Advertisement -

ఏపీకి స్పెషల్ స్టేటస్ రాబోతుంది..?

- Advertisement -

2014 ఎన్నికల్లో అలాగే 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ మరియు టీడీపీ నాయకుల గెలుపు కోసం అధికారం కోసం ఉన్న ఏకైక లక్ష్యం ప్రత్యేక హోదా. ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని రెండు పార్టీల నాయకులు విచ్చలవిడిగా వాడుకున్నారు. అయితే ఎప్పటిలాగే గెలిచిన తర్వాత ఈ విషయాన్ని చాలా చాకచక్యంగా మర్చిపోయారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు తరువాత స్పెషల్ ప్యాకేజీ ఒప్పుకొని ఆ తర్వాత మళ్లీ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ 2019 ఎన్నికల్లో నిలిచి ఘోరపరాజయాన్ని చూశారు.

అలాగే తాను కేంద్రం మెడలు వంచడం కాదు అవసరమైతే విడగొట్టి ప్రత్యేక హోదా తేస్తానని చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్డీఏలో లో చేరడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పై చాలా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం అని కొందరు చెప్తుంటే.. లేదు సొంత ప్రయోజనాల కోసం అని మరికొందరు చెబుతున్నారు.

అయితే జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే పనిలో పడ్డాడు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేంద్రంలో బీజేపీకి ఎవరు అవసరం లేదు. కానీ రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది. వాటి కోసమే బీజేపీ వైసీపీని ఎన్టీఏలో చేర్చుకోవడానికి సిద్ధమైంది. అయితే ఇలా చేరడానికి వైయస్ జగన్మోహన్రెడ్డి కేంద్రానికి కొన్ని కండిషన్స్ పెట్టాడని తెలుస్తుంది. అవేంటంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే వేచి చూడాలి. వైసీపీ ఎన్డీఏలో చేరుతుందన్న విషయాన్ని వైసీపీ నేతలు కానీ బీజేపీ నేతలు గానీ ఇప్పటి వరకు ఎక్కడా ప్రస్తావించలేదు.

అలాగే ఇక్కడ కూడా ఖండించలేదు. అయితే ఈ విషయంపై టీడీపీ నాయకులు మాత్రం చాలా స్పష్టంగా స్పందిస్తున్నారు. బీజేపీ వైసీపీని దగ్గర కూడా రానివ్వని వైసిపి నాయకులు వైసీపీ అనుకూల మీడియా కావాలనే తప్పుడు ప్రచారాన్ని మొదలు పెట్టారని చెప్తున్నారు. అలాగే వైసీపీ ఎప్పటికి ప్రత్యేక హోదా సాధించలేదని అది కేవలం టీడీపీతోనే సాధ్యమని ధీమ వ్యక్తం చేస్తున్నారు. అయితే 2014లో గెలిచినప్పుడు ఎందుకు సాధించలేదని వైసీపీ నాయకులు టీడీపీని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణాలో హల్చల్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..?

బండి సంజయ్ తెలంగాణాలో సక్సెస్ అయినట్లేనా..?

తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు వెనకడుగుకు కారణం ఏంటి..?

గంటా శ్రీనివాసరావు గురించి జగన్ మనసులో మాట..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -