Thursday, April 25, 2024
- Advertisement -

నిట్టనిలువునా చీలిన టీకాంగ్రెస్

- Advertisement -

ఓటమి చెందిన పార్టీ ఎలా దాన్ని దిగమింగుకొని పైకి ఎదగాలని ఆలోచించాలి.. కానీ తెలంగాణలో ఓడిన కాంగ్రెస్ పార్టీ ఆ గుణపాఠాన్ని నేర్వకుండా కులాల ఆధిపత్యంతో చీలిపోతూ మరింత కృంగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో కులాలను బట్టి కాంగ్రెస్ లో ప్రాధాన్యం ఇస్తున్నారని షబ్బీర్ అలీ, వీహెచ్ చేసిన వ్యాఖ్యలు.. ఉత్తమ్ ఆవేదన చూశాక కాంగ్రెస్ పార్టీ కులాల పరంగా విడిపోయిందని చెప్పక తప్పదు..

టీఆర్ఎస్ నాయకులు తనపై మాటల దాడి చేసినప్పుడు ఏ కాంగ్రెస్ నేత స్పందించలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ గాంధీభవన్ లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో వాపోయాడట.. అయితే కాంగ్రెస్ లో పెరిగిపోయిన రెడ్డి ఆధిపత్యాన్ని భరించలేక దిగ్గజ నేతలు మౌనం వహించినట్టు సమాచారం..

తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ తర్వాత రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డిలే అవుతామని లాబీయింగ్ చేయడాన్ని బీసీ, దళిత కాంగ్రెస్ సీనియర్లు తట్టుకోలేకపోతున్నారట.. అందుకే ఉత్తమ్ ను తిట్టినా వారంతా స్పందించడం లేదట..

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ అధ్యక్ష బరిలో ప్రస్తుతం బీసీ, దళిత నేతలైన పొన్నాల లక్ష్మయ్య, వీ హనుమంతరావు, మల్లుభట్టి విక్రమార్క, సర్వే సత్యనారాయణ, దామోదర రాజనర్సింహా వంటి వారు పోటీపడుతున్నారు. వారు ఉత్తమ్ ను తిట్టినా స్పందించలేదు. దీనికే ఉత్తమ్ తెగ బాధపడిపోయాడట..

దీన్ని బట్టి పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ రెడ్డీలు, బీసీలు, దళితులుగా నిట్టనిలువునా చీలిపోయిందని అర్థమవుతోంది. మరి ఈ కులాల కంపు ఆధిపత్యంలో కాంగ్రెస్ బాగుపడుతుందో లేదో చూడాలి మరీ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -