Friday, March 29, 2024
- Advertisement -

కెసీఆర్ అధికారంలోకి వచ్చినట్టుగానే బాబు కూడా మళ్ళీ వస్తాడా?

- Advertisement -

2019 ఎన్నికల్లో చంద్రబాబు జాతకం ఎలా ఉండబోతోంది? తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కెసీఆర్ ఇస్తున్న వార్నింగులతో ఆల్రెడీ భయంతో ఉన్న చంద్రబాబు కేంద్రంలో మెజారిటీ తగ్గినా మోడీ రావడం ఖాయం అన్న సర్వేలతో తీవ్రస్థాయిలో భయాందోళనలకు గురవుతూ ఉండడం కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎపిలో మళ్ళీ అధికారంలోకి రాకపోతే మాత్రం అది చంద్రబాబు, లోకేష్ అండ్ ఆంధ్రజ్యోతి, ఈనాడుతో సహా పచ్చ బ్యాచ్ జనాలందరూ మళ్ళీ కోలుకోలేనంతగా మోడీ, కేసీఆర్‌లు దెబ్బకొడతారనడంలో సందేహం లేదు అన్నది ఢిల్లీలో వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో పచ్చ జనాలందరూ కొత్తరాగం అందుకున్నారు.

తెలంగాణ లో పచ్చ మాఫియా కు గట్టిదెబ్బ పడిందనే సంతోషంలో ప్రత్యర్థులు ఉండగానే ….పచ్చమాఫియా ఆ దెబ్బలన్నీ దులుపుకొని , కొత్త డ్రామా మొదలు పెట్టింది..అదేమిటంటే ..తెలంగాణ లో అధికార పార్టీ నే మళ్ళీ అధికారంలోకి వచ్చింది ,కాబట్టి ఇక్కడా మళ్ళీ బాబు గారే వస్తారట…
మళ్ళీ ఆయనే రావాలట. అవును ఆయనే రావాలి ,ఎందుకంటె…????
కెసిఆర్ గారికంటే అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ,తెలంగాణ లో సచివాలయానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం వరకూ ఎక్కడా కెసిఆర్ కి తగ్గనందుకు ..
13 జిల్లాల్ల చిన్న రాష్ట్రం యొక్క పరిపాలనకు కార్యాలయాలు అనే విషయాన్ని రాజధాని నిర్మాణం అనే గంభీరమైన పేరుతో 33 వేల ఎకరాల వ్యవసాయ భూమిని రైతుల నుండి లాక్కొని ,స్పెషల్ ఫ్లైట్ లో సింగపూర్ జపాన్,ఇంగ్లాండ్,కొరియా,చైనా…ఇలా ప్రపంచ దేశాలన్నీ తిరిగి ,చివరికి వానొస్తే నీళ్ళు బయటకు పోకుండా లోపలే కారేలా కట్టి ,ఒక అధ్బుత టెక్నాలజీ ని ప్రపంచానికి అందించినందుకు ..
పండగలు,పబ్బాలు వస్తే జనాలకు పప్పులు,బెల్లాలు పంచి ,పుష్కారాలు వస్తే ఏ ప్రభుత్వమూ చెయ్యనంత ఘనంగా చేసి ,29 ప్రాణాలు పొట్టనబెట్టుకున్నందుకు..
నిరుద్యోగం ,కరువు ఎక్కడా పారిపోకుండా గట్టి ప్రయత్నాలు చేసినందుకు,
bjp తో కలసున్నన్ని రోజులు ప్రత్యేకహోదా పేరెత్తితేనే జైలు అని ,ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఊరూ వాడా దీక్షల పేరుతో ప్రజల సొమ్ము మింగేస్తున్నందుకు..
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా డబ్బుల మూటలు ఇక్కడి నుండే పంపిస్తున్నందుకు..
ఒక్క కంపెనీ రాకపోయినా లక్షల కోట్ల రూపాయిల MOU జరిగాయని ప్రచారం చేసుకున్నందుకు..
నీరు ,మట్టి ,చెట్టు ,ఇసుక ఇలా అవినీతి ఇండుకలడు,అందులేదని సందేహం లేకుండా దశదిశలా వ్యాపింపచేసినందుకు..
తన వర్గ మీడియా కు కోట్ల రూపాయలు దోచిపెట్టినందుకు..
ప్రతిపక్ష పార్టీ MLA లను కొన్నందుకు ,తన పార్టీ వాళ్ళు అప్పులిచ్చి ఆడవాళ్ళ మానాలతో వ్యాపారాలు చేసినా ఒక్క కేసు లేకుండా ప్రజారంజకంగా పాలించినందుకు,ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులైనా సరిపోనాన్ని దగుల్భాజీ పనులు చేసి ,మొత్తం మీద రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసినందుకు …
మిగిలున్న కళేబరాన్ని పచ్చ రాబుందులు పీక్కుతినేయడానికి….
మళ్ళీ ఆయనే రావాలి….

ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై, చంద్రబాబు రాజకీయాలు, పాలనపై పూర్తి అవగాహన ఉన్న జనాల నోటి నుంచి వస్తున్నమాట. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ దాదాపు 10 శాతం ఓట్ల తేడాతో చంద్రబాబు పార్టీపై ఘన విజయం సాధిస్తాడని జాతీయస్థాయి అగ్రశ్రేణి మీడియా సంస్థలు ఢంకా భజాయించి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో 2014ఎన్నికల్లో ఇచ్చిన ఆరు వందల దొంగ హామీలతో ప్రజలను మోసం చేయడం, అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ అక్రమాలు, అవినీతితో రెచ్చిపోయిన తెలుగుదేశం పాలనను ప్రజలు మరోసారి కోరుకుంటారా? పచ్చ మీడియా ఎంతగా ప్రచారం చేసినప్పటికీ అన్నీ మర్చిపోయి మరోసారి ప్రజలు బాబును గెలిపిస్తారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -