Thursday, March 28, 2024
- Advertisement -

నిమ్మగడ్డ కేసు.. సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ..!

- Advertisement -

నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దాంతో ఏపీ సర్కార్ కు షాక్ తగిలినట్లైంది. నిమ్మగడ్డ అంశంలో కోర్టు దిక్కరణ ప్రోసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. శుక్రవారం విచారణ జరిగింది.

నిమ్మగడ్డ పదవీకాలం కుదింపు.. కొత్త కమిషనర్ గా జస్టిస్ కనగరాజును నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కోట్టివేసిన విషయం తెలిసిందే. రమేష్ కుమార్ తిరిగి ఎస్‌ఈసీగా పునరుద్దరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే ప్రకారం రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం గవర్నర్‌కు ఉందని చెప్పింది. ఆ తర్వాత ఏపీ సర్కార్ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరినా.. సుప్రీం కోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనా కోర్టు విచారణ జరిపింది.. గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైకోర్టు సూచించింది. దీంతో నిమ్మగడ్డ గవర్నర్‌ను కలిసి తనను తిరిగి పదవిలో నియమించాలని కోరారు. ఇటు ప్రభుత్వం కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

వైసీపీ మంత్రులకే వార్నింగ్ ఇచ్చిన రోజా.. ఎందుకు ?

చంద్రబాబును నమ్మలేం.. ఆలోచనలో గవర్నర్ ?

నిమ్మగడ్డ సంతోషపడేలోపే.. ఊహించని షాక్ ఇచ్చిన జగన్..?

టీడీపీకి గట్టి దెబ్బ.. వైసీపీలోకి గంటా.. జగన్ గ్రీన్ సిగ్నల్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -