జగన్ కొట్టి మాట్లాడతారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన పృథ్వీ..!

1104
svbc Ex Chairman And Comedian Prudhvi Raj Praises Ap Cm Ys Janamohan Reddy
svbc Ex Chairman And Comedian Prudhvi Raj Praises Ap Cm Ys Janamohan Reddy

కమెడీయన్ పృథ్వీకి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్నప్పుడే రాజకీయాలవైపు అడుగు వెసి కొంత సక్సెస్ అయ్యారు అనుకునే లోపే ఓ మహిళతో ఆడియో కాల్ ఇష్యూతో తన పదవిని పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడి.. చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఆయన ఓ వెబ్ ఛానల్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆయన మాట్లాడుతూ.. జగన్ గారి గురించి చెప్పే ముందు నాకు 2004లో ప్రత్యక్షమైన దేవుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి చెప్పాలి. హైదరాబాద్ సాగర్ సొసైటీతో నా దేవుడు నాకు ప్రత్యక్ష మయ్యారు. అప్పుడే ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. జనం, మీడియా పెద్ద హంగామా ఉంది. అప్పుడు నన్ను అంబటి రాంబాబు గారు.. వైఎస్ గారికి పరిచయం చేశారు. ఆయనను చూసి కాళ్ళకు దండం పెట్టాను. ’ఏమయ్యా బాగున్నావా ?’ అని అన్నారు. ఆయన్ని చూస్తే నాకు దేవుడ్ని చూసినట్టే అనిపించేది.

హఠాత్తుగా ఒకరోజు ఆయన లేరన్న విషయం తెలియగానే చాలా బాధపడ్డాను. ఇడుపుల పాయ వెళ్లి.. దండంపెట్టుకుని వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాను. 2017 సెప్టెంబర్‌లో జగన్ మోహన్ రెడ్డిగారిని ఆయన ఇంట్లోనే కలిశాను. వైఎస్ గారి పాదయాత్ర వన్ మ్యాన్ షో.. అలాగే జగన్ గారి పాదయాత్ర కూడా వన్ మ్యాన్ షో.. ఎవరు ఏమనుకున్నా.. ఆయన పడ్డ కష్టం వల్ల 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గెలిచారు. జగన్ గారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది.

ఆయన నాతో కొట్టి మాట్లాడతారు. పృథ్వీ అన్న చాలా ఇదీ అంటారు. ఆయన అన్నా అనే అంటారు. సొంత కుటుంబం సభ్యుడులాగే చూస్తారాయన. జగన్ గారిని చూసి చాలా నేర్చుకోవాలి.. ఆయన లాగా మేం లేనందుకు సిగ్గుపడుతున్నాం. ఆయన్ని చూసి మా అలవాట్లు చాలా వదిలేశామ్’ అని జగన్ పై ప్రశంసలు కురిపించాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ.

గాజువాకలో చిత్తుగా ఓడిపోయాడని.. వైజాగ్ పై పవన్ కి కసి : రోజా

టీడీపీ వేర్లు కూడా పీకేసిన జగన్.. సరికొత్త చరిత్రను లిఖించాడు..!

జగన్ తన వ్యూహాలతో బాబును తికమక పెట్టాడు.. ?

మూడు రాజ‌ధానులు.. నాలుగు జోన్లు.. 25 జిల్లాలు.. జ‌గ‌న్ పాలన అదరహో..!

Loading...