Friday, April 19, 2024
- Advertisement -

కాంగ్రెస్ నేతలు ఇక మారరా..ఎందుకిలా కొట్టుకుంటున్నారు..

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ లో ఒకరితో ఒకరికి పడట్లేదని ఇప్పటికే అందరికి తెలుసు. సీనియర్ లు జూనియర్ లు ప్రతి సారి కొట్టుకుంటూ ఉండడంతో పార్టీ ప్రతిష్ట రోడ్డున పడుతుంది.. అయితే ఇది లోకల్ ఎలక్షన్స్ అయినా GHMC పరిధిలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది.. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల స‌న్నాహాక స‌మావేశంలో పార్టీ నేత‌ల మ‌ధ్య ఉన్న విభేదాలు మ‌రోసారి భ‌య‌ట‌ప‌డ్డాయి. టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు స‌మైఖ్యంగా కొట్లాడాల్సిన నేత‌లు పీసీసీ చీఫ్ ముందే బూతులు తిట్టుకుంటూ కొట్టుకునే వ‌ర‌కు వెళ్లారు.

స‌మావేశంలో నియోజ‌క‌వ‌ర్గానికో వ్యూహాంతో ముందుకెళ్లాల‌ని పీసీసీ నిర్ణ‌యించింది. దీనిపై ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గురించి మాట్లాడుతుండ‌గా… మ‌ధ్య‌లో దాసోజు శ్ర‌వ‌ణ్ ఎదో చెప్ప‌బోగా, మ‌ధ్య‌లో మ‌రో నాయ‌కుడు నిరంజ‌న్ క‌ల‌గ‌జేసుకోవ‌టంతో మాట మాట పెరిగింది. దీంతో నేత‌లు ఒక‌రిపై ఒక‌రు దూసుకెళ్తుండ‌గా… ఇత‌ర నేత‌లు ప‌క్క‌కు తీసుకెళ్లారు.

పీసీసీ చీఫ్ ముందే గాంధీబ‌వ‌న్ లో ఇలా నేత‌లు బాహబాహీకి రెడీ అవ‌టంపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -