Thursday, April 25, 2024
- Advertisement -

జేసి ని టార్గెట్ చేశారా.. టీడీపీ కి మళ్ళీ మొదలైందిగా..?

- Advertisement -

ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినా జేసీ కుటుంబానికి కష్టాలు తప్పట్లేదు.. ఓ వైపు జగన్ ని పొగుడుతూనే మరోవైపు ఆయనపై చేయాల్సిన కుట్రలు అన్ని చేస్తున్నాడు..దాంతో జగన్ దీన్ని పసిగట్టి వారి పనిపాట పనిలో నిమగ్నమైపోయాడు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగారు. అయితే ఆయనతోనూ వారికి సన్నిహిత సంబంధాలు లేవు. మొదటి సారి కాంగ్రెస్ గెలిచినప్పుడు మంత్రి పదవి తెచ్చుకున్నా.. రెండో సారి ఆ అవకాశం దక్కలేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకపోవడంతో … చిరకాల ప్రత్యర్థి పరిటాల కుటుంబం టీడీపీలో ఉన్నప్పటికీ..వైసీపీ నుంచి ఆఫర్ ఉన్నప్పటికీ..వారు జగన్ వెంట నడవకుండా… టీడీపీలో చేరారు.

జగన్ రాజకీయంగా అంత చతురుడు కాకపోయినా గట్టి సవాళ్ళను విసురుతాడు.. రాజకీయంగా దెబ్బ తీసేకంటే జేసీ ని ఆర్థికంగా కొట్టాలని చూస్తున్నాడు.. ఈ క్రమంలోనే స్వాతంత్రం రాక ముందు నుంచి జేసీ కుటుంబానికి ఉన్న బస్సుల బిజినెస్ పూర్తిగా దెబ్బతినేలా రవాణాశాఖ అధికారులతో పని పూర్తి చేయించారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన బిజినెస్‌లన్నీ.. దెబ్బతిన్నాయి. ఇప్పుడు వారి కుటుంబానికి ఉన్న మైనింగ్ పై కూడా దృష్టి పడింది.

జేసీ దివాకర్ రెడ్డి ఇటీవలే తన మైనింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఇటీవలే మైనింగ్ ఆఫీస్ కి తన అనుచరులతో వెళ్లి అన్ని దోచేశారు చివరికి మైనింగ్ కూడా లాక్కోవాలని చూస్తున్నారా అని వాదించారు. అయితే జేసీ బ్రదర్ కదిలితే కేసు పెట్టాలని చూస్తున్నారు.. అలా అని ఆయన మైనింగ్ లైసెన్స్‌లను వదిలేసే అవకాశం కూడా లేదు. నోటీసులు కూడా వెళ్లిపోయాయి. అక్రమాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అయితే.. మైనింగ్ అధికారులు టీడీపీ నేతల గనులన్నింటిలోనూ అక్రమాలు గుర్తించారు. కొంత మంది కోర్టులకు వెళ్లి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు మరి జేసీ ఏం చేస్తారో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -