Friday, April 19, 2024
- Advertisement -

రాములమ్మ తిట్లతో టీ కాంగ్రెస్ నేతలకు అనుమానం

- Advertisement -

పోను పోలేను అంటూనే రాములమ్మ బీజేపీకి మద్దతుగా మాట్లాడుతుండడం టీకాంగ్రెస్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు టీఆర్ఎస్ లోనే ఉండి.. కేసీఆర్ తర్వాత నంబర్2 పొజిషన్ లో ఉన్న విజయశాంతి అనంతరం కేసీఆర్ వైఖరి నచ్చక బయటకు వచ్చారు. మధ్యలో బీజేపీలో చేరారు. అక్కడ ఫేమ్ లేకపోవడంతో చివరగా కాంగ్రెస్ లో సెటిల్ అయ్యారు.

అయితే టీఆర్ఎస్ అంటేనే ఉవ్వెత్తున లేసే విజయశాంతి కొద్దిరోజులుగా కేసీఆర్ ను, కేటీఆర్ పై పరుష విమర్శలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కేసీఆర్, కేటీఆర్ లపై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి కేటీఆర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

అయితే వీరిద్దరి మాటల యుద్ధంతో రెండు పార్టీల మధ్య వైరం పతాక స్థాయికి చేరిన వేళ మధ్యలో వచ్చేసింది రాములమ్మ. తాజాగా జేపీ నడ్డాకు వ్యాఖ్యలకు విజయశాంతి స్పందించారు. జేపీ నడ్డా తెలంగాణ ప్రాజెక్టుల్లో కేసీఆర్ అవినీతిపై మాట్లాడారని.. దీనిపై కేంద్రంలోని సీబీఐ, ఇతర సంస్థలకు ఫిర్యాదు చేసి వీరి అవినీతిని నిగ్గుతేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీపై ఫైర్ అవుతున్న కేటీఆర్ ముందు తన తండ్రి అనుమతి తీసుకొని మాట్లాడాలని లేకపోతే ఇబ్బందులు పడుతావ్ అంటూ ఎద్దేవా చేసింది.

ఇలా బీజేపీకి సపోర్ట్ గా రాములమ్మ మాట్లాడడం.. టీఆర్ఎస్ ను ఇబ్బందుల్లోకి నెట్టడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నేతగా ఉండి బద్ధ శత్రువైన బీజేపీకి సపోర్ట్ చేయడంపై ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. రాములమ్మ బీజేపీలోకి మార్గం సుగమం చేసుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అన్న అనుమానాలు టీ కాంగ్రెస్ నేతలను వెంటాడుతున్నాయట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -