Friday, April 19, 2024
- Advertisement -

బాబు హెలికాప్టర్ షాట్…. పవన్‌ని ఎర్రిమాలోకాన్ని చేసేశాడుగా?

- Advertisement -

దటీజ్ చంద్రబాబు….. కెసీఆర్‌ని కటకటాల వెనక్కి పంపిస్తా అన్న చంద్రబాబు వారం తిరిగేసరికి తన కులగురువు, మీడియా గురువు సాయంతో కెసీఆర్‌తో టై అప్ పెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు కెసీఆర్‌కి తాకట్టుపెడితేనేమి…… తాను మాత్రం ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడ్డాడు. ఆడియో, వీడియో సాక్ష్యాలతో దొరికిన బాబు బుక్కవ్వడం ఖాయం అని అనుకున్న వాళ్ళందరినీ ఎర్రి పువ్వులను చేశాడు చంద్రబాబు.

ఇక ఇఫ్పుడు కూడా అదే కథ. మోడీతో చంద్రబాబు బ్రేక్ అప్ అన్న వెంటనే సినిమా వాళ్ళు, ఆంధ్రప్రదేశ్‌లో ఉంటూ బాబు కోసం పనిచేసే మేధావులు, రాధాకృష్ణ, రామోజీరావులు మోడీ ప్రభుత్వం పడిపోతుందేమో……. బాబు-మోడీలు ఆజన్మ శతృవులైపోయారేమో అన్నట్టుగా ప్రజలను నమ్మించారు. ఈ ప్రచారాన్ని నమ్మి పవన్ తొందరపడ్డాడు. బాబు వదిలేసిన మోడీతో టై అప్ అయి 2019 ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవొచ్చు అనుకున్నాడు. మోడీకి మద్దతుగా జాతీయ మీడియాతో మాట్లాడాడు. అయితే మొత్తం పరిణామాలను గమనించిన బాబు ప్లేట్ ఫిరాయించాడు. సిబిఐ కేసుల భయం, పవన్ దూరమవడం లాంటి వాటితో డిఫెన్స్‌లో పడిపోయిన బాబు…… ఇప్పుడు మోడీ అండ్ కోకు రాయబారం పంపాడు. నిధులు ఇవ్వకపోయినా పర్లేదు……. ప్యాకేజ్ పేరు చెప్పి భారీగా ఏదో ఒక ప్రకటన చేయండి…… నేను మళ్ళీ కలిసిపోతా అని సుజనా చౌదరితో బిజెపి పెద్దలకు సందేశం పంపించాడు. బాబు ప్రపోజల్‌కి మోడీ ఒకే అంటే మాత్రం ….. ఆ వెంటనే మోడీ అద్భుతం, మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించిన నిధులు ఇంకా అద్భుతం అని చెప్పి చంద్రబాబు మోడీకి జై కొట్టడం ఖాయం. ఇక ఆ తర్వాత నుంచీ పచ్చ మీడియా మొత్తం అవే మాటలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మిస్తాయి. రాహుల్ గాంధీ పవర్‌లోకి వస్తాడా? పాడా? ఏమీ లేకపోయినా మోడీకి జై కొట్టడమే కరెక్ట్ అని బాబుకు బాకా ఊదడం ఖాయం. మొత్తంగా పవన్ కళ్యాణ్, ప్రజలు మాత్రం ఎర్రి ఎంగళాయిలప్పలుగా మిగిలిపోతారనడంలో సందేహం లేదు. అయితే 2014లో లాగే ఈ సారి కూడా జనాలను అమాయకులను చేస్తూ చంద్రబాబు ఆడే డ్రామాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కడతారా? లేక బాబు డ్రామాలకు ఇప్పటికే విసిగిపోయి ఉన్న జనాలు 2019లో టిడిపికి పూర్తిగా సమాధి కడతారా అన్న విషయం మాత్రం తేలాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -