Saturday, April 20, 2024
- Advertisement -

చంద్రబాబు ఆర్భాటాలు దేనికి పనికొస్తాయి..?

- Advertisement -

చంద్రబాబు కి ఉన్న మేధో సంపత్తి గురించి ఎల్లో మీడియా లో ఎలా చెప్పేదో అందరికి తెలిసిందే.. చంద్రబాబు జ్ఞాపక శక్తి గురించి , అయన మేధస్సు గురించి ప్రపంచంలో ఎవరికీ లేని విధంగా చెప్పి చంద్రబాబు మెప్పు పొందే విధంగా రాస్తూ అయన నుంచి నిధులు దండుకునేవారు. ఇదంతా హాస్యాస్పదం అయినా టీడీపీ నాయకులు అయన సన్నిహితులు మేధా శ‌క్తిపై క‌థ‌లు క‌థ‌లు చెప్పుకొనేవారు. పురాణం చరిత్రలను సైతం వల్లెవేస్తూ తాను రాజకీయ చతురుడినని చెప్పుకునే ప్రయత్నం చేసే చంద్రబాబు కి అప్పటి మంత్రులు క్యాబినెట్ మీటింగ్ కి వెళ్లాలంటే తెగ భయపడేవారట..

రెండు నాల్కల ధోరణి కి వందకు వంద శాతం న్యాయం చేకూరేటట్లు మాట్లాడే చంద్రబాబు తాను చేస్తే అభివృద్ధి అదే పని ఇతరు లు చేస్తే మోసం అన్నట్లు వ్యవహరిస్తున్న ఆయన తీరును చూస్తుంటే ఇంకేమని విమర్శించాలో అర్థం కావట్లేదు.. తాను అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను అన్యాయంగా తన పార్టీ లోకి చేర్చుకుని కనీస రాజకీయ విజ్ఞత లేకుండా ప్రదర్శనుంచి ఇప్పుడు రాజీనామా చేస్తేనే గానీ పార్టీ లోకి రావద్దు అని కండిషన్ పెట్టిన జగన్ టీడీపీ వారిని వైసీపీ లోకి చేర్చుకుంటే బాబు కి అది మోసం అనిపిస్తుంది.. ఏది మోసమో, ఏది నిజాయితో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు..

ఇక ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు చేస్తున్న వింత వింత చేష్టలకు ఒకవిధంగా ప్రజలకు నవ్వొస్తుంది.. అధికారంలో ఉన్నట్లు టీడీపీ నాయకులకు అధికారాలు ఇస్తూ జబర్దస్త్ స్కిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు..  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుల ఎంపికను కూడా చంద్రబాబు చేశారు. జంబో జెట్ లాంటి పొలిట్ బ్యూరో లో మొత్తం 25 మంది సభ్యులను నియమించారు. సీనియర్ నేతలందరికీ పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్న పాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, బాలకృష్ణ, వర్ల రామయ్య, కళావెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమ, ఫారూక్, గల్లా జయదేవ్, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి వంటి వారిని నియమించారు. పవర్ లో లేని ఈ అధికారాలు ఇచ్చి ఏం లాభం అని వైసీపీ వర్గాలు హేళన చేస్తున్నాయి..

టీడీపీ కి ఈ విషయంలో అంత అత్యుత్సాహం ఎందుకు..

న్యాయస్థానం విషయంలో చంద్రబాబు కి అంత అవసరమా..

అడ్డదారులు వెతుకుతున్న చంద్రబాబు..

చంద్రబాబు కు తెలుగు తమ్ముళ్ళను కలిసే టైం కూడా లేదా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -