కాంగ్రెస్, టీడీపీ పొత్తుకు బ్రేకప్..

384
TDP Contesting alone in 2019 Election in AP
TDP Contesting alone in 2019 Election in AP

పొత్తు రాజ‌కీయాలు న‌డ‌ప‌డంలో చంద్ర‌బాబు త‌రువాతే ఎవ‌రైనా. త‌న‌కు అవ‌స‌రం ఉన్న‌ప్పుడు పొత్తు పెట్టుకోవ‌డం అవ‌స‌రం తీరాక వ‌దిలేయ‌డం అలావాటే. తాజాగా బాబు మ‌రో సారి నిరూపించుకున్నారు. తెలంగాణాలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బ‌ద్ద‌శత్రువైన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని మ‌హాకూట‌మిని ఏర్పాటు చేశాయి. కేసీఆర్ దెబ్బ‌కి కూట‌మి ఘొరంగా ఓడిపోయింది.

ఇక ఏపీలో కూడా పొత్తు ఉంటుంద‌ని సంకేతాలిచ్చారు బాబు. అయితే గ‌త కొన్ని రోజులుగా టీడీపీ- కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటారా లేదా అనే విషయంపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీనేతలు కూడా పొత్తుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. తెలంగాణా ఎన్నిక‌ల్లో కూట‌మిని ప్ర‌జ‌లు తిర‌స్క‌రించ‌డంతో ఏపీలో కూడా అలాంటి ప‌రిస్థితులు త‌లెత్తేలా ఉండ‌టంతో పొత్తు ఉండ‌ద‌ని తేల్చి చెప్పారు బాబు.

తాజాగా ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబమని చంద్రబాబు రాహుల్ దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణా ప్ర‌జ‌లు కూట‌మిని తిర‌స్క‌రించిన విష‌యాన్ని గుర్చు చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్ సభ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేయాలని టీడీపీ భావిస్తుంది. అంతేకాదు తెలంగాణలో కూడా పొత్తును విరమించుకున్నట్లు సమాచారం.

అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్య‌క్షుల‌తో రాహుల్ స‌మావేశం అయ్యారు. ఏపీ ప‌రిస్థితుల‌పై ప్ర‌త్యేకంగా నేత‌ల‌తో చ‌ర్చించారు. ఆంధ్రలో పరిస్థితి భిన్నంగా ఉందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. భాజాపాపై వ్య‌తిరేక‌త ఉంద‌ని అదేస‌మ‌యంలో కాంగ్రెస్‌పై ప్ర‌జాగ్ర‌హం త‌గ్గి ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని నేత‌లు చెబుతున్నారు. అయితే ఈ పెరిగిన ఆదరణ ఓటు బ్యాంకుగా మారుతుందో లేదో అన్న అనుమానం కూడా కాంగ్రెస్ నేతల్లో ఉంది. పొత్తుపై కాంగ్రెస్ నేత‌ల్లో మాత్రం ఆశ చావ‌డంలేదు.