Friday, April 26, 2024
- Advertisement -

బాబుకు అదిరిపోయె బిగ్ షాక్…ఫ్యాన్ గూటికి బెజవాడ టీడీపీ ముఖ్య నేత

- Advertisement -

చంద్రబాబుకు ఆగష్ట్ సంక్షోభం తప్పేటట్టులేదు. బెజవాడ టీడీపీలో బిగ్ వికెట్ డౌన్ అయ్యేందుకు రంగం సిద్దం అయినట్లు సమచారం. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న బాబు రాష్ట్రానికి వచ్చే సమయానికి బిగ్ షాక్ తగలనుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత, రాజధాని ప్రాంతంలో ఒకప్పుడు చక్రం తిప్పిన ఓ మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఇక టీడీపీలో ఉండకూడదని నిర్ణయించుకున్నారట.

ఆయన ఎవరో కాదు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వైసీపీ పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను ఢీ కొట్టాలంటే బొప్పన భవకుమార్ వల్ల సాధ్యం కాదని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నారట. గద్దె రామ్మోహన్ రావుకు చెక్ పెట్టాలంటే బొండా ఉమామహేశ్వరరావు లాంటి నేతలతో అయితే చెక్ పెట్టొచ్చని వైసీపీ భావిస్తోందట. అందుకే బోండా ఉమాను పార్టీలో చేర్చుకొనేదానికి సిద్దంగా ఉన్నారంట.

బొండా టీడీపీ నుంచి గ‌తంలో సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌ల్లాది విష్ణు చేతిలో కేవ‌లం 25 ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అంతేకాదు వైసీపీనీ విమర్శించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు ఉన్నారు. మరి బోండా ఉమామహేశ్వరరావు పార్టీలో చేరితే ఏ పదవిని అప్పగిస్తారన్న చర్చ పార్టీలో జరుగుతుంది. పార్టీ మారడంపై బోండా స్నేహితులు క్లారిటీ కూడా ఇచ్చారు.

బొండా వైసీపీలో చేరితే ఆయ‌న‌కు విజ‌య‌వాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలను వైసీపీ ఇవ్వటానికి ముందుకి వచ్చినట్లు తెలుస్తుంది. అక్కడ మొన్న పోటీచేసిన బొప్పన భవకుమార్‌, ఎన్నికల ముందు వరకు ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఉన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పాగా వేయాలని భావిస్తున్న వైసీపీ బొండా ఉమామహేశ్వరరావు పార్టీలో చేరితే ఆయనను అక్కడ నుంచే రంగంలోకి దింపాలని భావిస్తోందట.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న బొండా ఉమామహేశ్వరరావు ఈ నెల 4, 5 తేదీల్లో నగరానికి తిరిగి వచ్చిన తర్వాత తన అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ ఏంటనేది ప్రకటించనున్నారు. బొండా ఉమా పార్టీ మారతారంటూ వస్తున్న వార్తలను ఆయన అనుచరులు ఇప్పటి వరకు ఖండిచకపోవడంతో తెలుగుదేశం పార్టీలో గుబులు మెుదలైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -