Saturday, April 20, 2024
- Advertisement -

జేసీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సొంత పార్టీ నేత..

- Advertisement -

సీఎం వైఎస్ జగన్ వందరోజుల పాలనపై జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ కు వందకు వంద మార్కులు వేయవచ్చని ప్రశంసల వర్షం కురిపించారు. జేసీ చేసిన వ్యాఖ్యలకు పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కౌంటర్ ఇచ్చారు. ఆయన మాటలను ఎవరూ సీరియస్ గా తీసుకోరన్నారు. ఆయనకు పొగడటం అలవాటే నని …ఎప్పుడు ఎవర్ని పొగుడ్తారో తెలియని ఎద్దేవ చేశారు.

ఎవరు సీఎంగా ఉంటే వారికి భజన చేయడం జేసీకి అలవాటేనని చెప్పుకొచ్చారు. రాజకీయ పదవుల్లో మినహా ఆయనకు ప్రజల్లో పట్టులేదంటూ మండిపడ్డారు. గతంలో జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాలన్నారు.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయనను పొగిడి వైయస్ జగన్ ను విమర్శించారని ఇప్పుడు జగన్ సీఎం కావడంతో ఆయనను పొగుడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఆయనకు అలవాటేనని ప్రజలు పెద్దగా పట్టించుకోరని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -