Friday, April 26, 2024
- Advertisement -

బాబుకు షాక్…సంచలన నిర్ణయం దిశగా మాజీ మంత్రి అఖిల ప్రియ

- Advertisement -

ఏపీలో తాజా ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మితో చాలా వ‌ర‌కు కుంగిపోతోన్న విప‌క్ష టీడీపీకి వ‌రుస పెట్టి షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. అసలే పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు బీజేపీలోకో ? లేదా ? వైసీపీలోకో వెళ్లిపోతున్నారు. ఈ షాకులు ఇలా ఉంటే సీనియర్ నాయకులు మృతి చెందడం ఆపార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పది రోజుల వ్వవధిలోనె కోడెల,శివప్రసాద్ లు మరణించి పార్టీ శ్రేణుల‌తో పాటు పార్టీ అధినేత సైతం షాక్ లో ఉంటే తాజాగా మరో ఎదురుదెబ్బ తగలనుందనె వార్తలు వినిపిస్తున్నాయి.

కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కేంద్రహోంశాఖ సహాయంత్రి కిషన్ రెడ్డితో హైదరాబాద్ లో భేటీ కావడం పార్టీలో అలజడి రేపుతోంది. ఆయనతో పాటు ఎంపీ గల్లా జయదేవ్ కూడా సమావేశ మయినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత అఖిలప్రియ బిజెపి తీర్థం పుచ్చుకుంటారని లేదా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ప్రచారం సాగింది.

తాజాగా కేంద్ర మంత్రి, బిజెపి నేత కిషన్ రెడ్డితో భేటీ కావడంతో అఖిల ప్రియ బిజెపి వైపు చూస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏపీలో పాగా వేయాలని చూస్తున్న భాజాపా టీడీపీలో ఉన్న కీలక నేతలను పార్టీలోకి తెచ్చేందుకు పోకస్ పెట్టిందనె చెప్పాలి. ఇప్పటికే ఎంపీలు,ఇతర నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.

అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసుల గురించి అఖిలప్రియ కిషన్ రెడ్డికి వివరించినట్లు చెబుతున్నారు. అరగంటకు పైగా సాగిన ఈ భేటీలో పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలా వరుసగా నేతలు కేంద్రమంత్రులను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పరిణామాలు చూస్తుంటే త్వరలోనె కమలం గూటికి చేరనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -