Friday, April 19, 2024
- Advertisement -

చంద్రబాబుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే షాక్…సీఎం జగన్ తో భేటీ

- Advertisement -

ఏపీలో టీడీపీకీ జవసత్వాలు తీసుకు రావాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటె….మరో వైపు ఆపార్టీ నేతలు ఆయనను నమ్మడంలేదు. ఒక్కొక్కరే పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే కీలక నేతల రాజీనామాతో ఇబ్బందిపడుతున్న బాబుకు మరో కీలక నేత హ్యాండ్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. జిల్లా తెలుగుదేశం పార్టీలో నెలకొన్న ఆధిపత్యపోరు తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీ మారుతారనె ప్రచారం సాగుతోంది.

తూర్పుగోదావరి జిల్లాల్లో పార్టీ నేతల్లో జోష్ నించేందుకు వచ్చిన బాబుకు ఎదురు దెబ్బతగిలింది. తోట త్రిమూర్తులు ఏకంగా చంద్రబాబు సమావేశానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు కాకినాడలో జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయగా… ఈ సమావేశానికి త్రిమూర్తులు దూరంగా ఉన్నారు.నియోజకవర్గంలోనే ఉండి సమావేశానికి హాజరుకాకపోవడంపై చంద్రబాబు ఆరా తీశారు.

సమావేశానికి తోట త్రిమూర్తులు రావాలని సీనియర్ నేతతో బాబు రాయబారం నడిపినట్లు తెలుస్తోంది.చంద్రబాబు ప్రతినిధులు వచ్చినా తాను సమీక్షకు రానని తేల్చి చెప్పారు.జిల్లాకు చెందిన ముఖ్యనేతలు తమకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన తనను కలిసేందుకు వచ్చిన టీడీపీ నేతకు చెప్పినట్టు తెలుస్తోంది.

కొంతకాలంగా టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న తోట త్రిమూర్తులు… త్వరలోనే వైసీపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి..ఇటీవలే ఆయన ముఖ్యమంత్రి జగన్ తోనూ సమావేశమయ్యారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన వైసీపీ లో చేరుతారని టీడీపీ నేతలే చెబుతున్నారు.మొత్తానికి స్వయంగా చంద్రబాబు పిలిచినా… టీడీపీ సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీ మారతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -