Friday, March 29, 2024
- Advertisement -

త‌నిఖీలు చేయ‌డం టీడీపీ నేత‌ల‌కు అవ‌మాన‌మా….?

- Advertisement -

ఆంధ్రప్ర‌దేశ్ మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడిని గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టులో త‌నిఖీలు చేసి సామాన్య ప్ర‌యాణీకుడిలాగా పంపించ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. హైదరాబాద్ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి పయనమయ్యారు. అయితే ఎయిర్ పోర్టు ముఖద్వారం వద్దే చంద్రబాబు వాహనాన్ని భద్రతా సిబ్బంది నిలిపివేశారు. ఆయనను సాధారణ వ్యక్తిలాగా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

అంతేకాడు బాబు వాహ‌నాన్ని కూడా అనుమ‌తించ‌లేదు. వీఐపీ లాంజ్ నుంచి బాబు సాదారాణ ప్ర‌యానీకులు ప్ర‌యానించే బ‌స్సులో నె వెల్లారు. దీనిపై టీడీపీ నేత‌ల భ‌గ్గుమంటున్నారు. బ‌ధ్ర‌తా అధికారుల‌త‌నిఖీల‌కు వ్య‌తిరేకంగా అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న కూడా నిర్వ‌హించారు. ఇక మాజీ హోమంత్రి ప్ర‌స్త‌త టీడీపీ ఎమ్మెల్యే చిన‌రాజ‌ప్ప సైతం దీనిపై స్పందించారు.

విమానాశ్రయ సిబ్బంది తీరును తప్పుబట్టారు. వీఐపీ, జడ్‌ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబును తనిఖీలు చేయడం దారుణమన్నారు. విమానాశ్రయంలో ఆయనకు ప్రత్యేక వాహనాన్ని కేటాయించకపోవడంపైనా మాజీ హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు భద్రతను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

గ‌తంలో ముఖ్య‌మంత్రి కాబ‌ట్టి త‌నిఖీలు లేకుండా ఎయిర్ పోర్టులోకి వెల్ల‌వ‌చ్చు. కాని ఇప్పుడు సీఎంకాదు ఒక ప్ర‌తిప‌క్ష‌నేత మాత్ర‌మే. ఇద‌లా ఉంటె గ‌తంలో ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ ఎన్నో సార్లు విమానాశ్ర‌య అధికారులు త‌నిఖీలు చేశారు. క‌నీసం వీఐపీ లాంజ్ వ‌ర‌కు కూడా పోనీయ‌లేదు. అప్పుడు జ‌గ‌న్ హుందాగా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. మ‌రిఇప్పుడు బాబు ప్ర‌తిప‌క్ష‌నేత కాబ‌ట్టి త‌నిఖీలు చేశారు. దీనిపైన టీడీపీ నాయ‌కులు ఎందుకు అవ‌మానంగా ఫీల‌వుతున్నారో అర్థం కావ‌డంలేద‌ని సామాన్య ప్ర‌జానీకం అనుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -