Thursday, April 18, 2024
- Advertisement -

విశాఖలో లోకేష్ పర్యటన రోజే బిగ్ షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలవడంతో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. పార్టీనుంచి ఎవరు జంప్ అవుతారో తెలియక బాబు గందరగోలంలో ఉన్నారు. కీలక నాయకులంతా ఇతర పార్టీల్లోకి వెల్లారు. మరి కొంత మంది పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు.

తాజాగా విశాఖలో టీడీపీకీ భారీ షాక్ తగిలింది. విశాఖ టీడీపీలో 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు సందర్భంగా విశాఖ జిల్లాలో మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటన రోజే పార్టీకి రాజానామా చేయడం పెద్ద ఎదురు దెబ్బే.

సన్యాసి పాత్రుడు ఆయన భార్య వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే సన్యాసిపాత్రుడు, అయ్యన్నపాత్రుడు మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఆ సమయంలో టీడీపీ నాయకత్వం వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలకు పుల్‌స్టాప్ పెట్టింది.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. టీడీపీకి చెందిన కీలక నేతలు బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ వైపు చూస్తున్నారు. గత కొంత కాలంగా అయ్యన్నపాత్రుడు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయి. అవి ఇటీవలి కాలంలో మరింత తీవ్రతరం కావడంతో సన్యాసిపాత్రుడు, ఆయన భార్య అనిత వైసీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు.టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్ ఇప్పటికే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -