Thursday, April 18, 2024
- Advertisement -

వైసీపీకీ పూర్తి మెజారిటీ… ఎన్ని సీట్లంటె…?

- Advertisement -

మే 23 ఎప్పుడు వ‌స్తుందాని ప్ర‌జ‌లు, రాజ‌కీయ నాయ‌కులు ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఎందంకంటె ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తును మార్చె ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఫ‌లితాలు వెలువ‌డ‌డానికి ఎక్కువ రోజులు ఉండ‌టంతో ప్ర‌ధాన పార్టీల నేత‌లు స‌ర్వేలు చేయించుకున్నారు. ఇక జాతీయ స‌ర్వేలు అన్ని కూడా వైసీపీకే జైకొట్టాయి. అయితే ఓ టీడీపీ నేత చేయించిన స‌ర్వే ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. ఎందుకంటె యన 2014లో కూడా సొంత సర్వే చేయించుకున్నారు. అప్పట్లో టీడీపీ గెలుస్తుందని రిపోర్ట్ వచ్చింది. అదే ఉత్సాహంతో ప్ర‌స్తుతం చేయించిన స‌ర్వేలో త‌ల బొప్పిక‌ట్టే ఫ‌లితాలు వ‌చ్చాయంట‌.

రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలు ఉండ‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటె తాను చేయించిన స‌ర్వేలో 88 మ్యాజిక్ ఫిగ‌ర్‌ను సాధించాలి. తాను చేయించ‌న స‌ర్వేలో వైసీపీకి 105 సీట్లతో అధికారంలోకి వస్తుందట. టీడీపీ 58 సీట్ల వరకూ సాధిస్తుందట. జనసేన పార్టికి మూడు సీట్ల వరకూ వస్తాయట.మరో 9 స్థానాల్లో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ ఉంటుందని తెలిసిందట. ఒకవేళ ఆ మొత్తం సీట్లు టీడీపీకి వస్తాయని అనుకున్నా.. అధికారం మాత్రం వైసీపీకే వస్తుంది. ఒక వేల ఆ 9 సీట్ల‌లో స‌గం గెలుకుకున్నా 110 సీట్లు ప‌క్కానంటం.

స‌ద‌రు టీడీపీనేత చేయించిన స‌ర్వేపై పార్టీ నేత‌లు గుర్రుగా ఉన్నారంట‌. లేనిపోని గందరగోళం సృష్టించేందుకే ఈ సర్వేను తెరపైకి తెచ్చారా అని సదరు నేతపై మండిపడుతున్నట్లు తెలిసింది. 23న ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత ఎవ‌రి స‌ర్వే నిజం అవుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -