Saturday, April 20, 2024
- Advertisement -

టీడీపీ నాశనానికి చంద్రబాబె ముఖ్య కారణమా..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి రావడమే కాదు టీడీపీ పతనానికి కూడా పునాదులు వేసేలా గెలిచాడు.. నిజం చెప్పాలంటే జగన్ దెబ్బకు టీడీపీ కుదేలయిపోతుంది.. ఏ ముహూర్తాన జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాడో కానీ ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటికే ప్రజల్లో నమ్మకం కోల్పోయి నడిరోడ్డు మీదకి వచ్చామన్న భావన టీడీపీ లో ఉంది.. ఆ నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలన్న ఆలోచనలో పార్టీ ఉంటే కొత్తగా పార్టీ ఫిరాయింపులు వారికి లేని తలనొప్పులు తెస్తుంది. దాంతో ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదు.

గతంలో వారు ప్రోత్సహించిన పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు వారికి గుదిబండ గా మారడంతో తప్పు తెలిసొచ్చింది అని కుమిలిపోవడం టీడీపీ వారి వంతు అయ్యింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర లోని చాలామంది టీడీపీ నేతలు వైసీపీ లోకి వచ్చేశారు.. అమరావతి ఉద్యమం నేపథ్యంలో ప్రజల్లో తమపై పెట్టు కున్న నమ్మకాన్ని వమ్ము చేయలేక విశాఖ టీడీపీ నేతలు చంద్రబాబు కు వ్యతిరేకంగా పనిచేస్తూ వైసీపీ కి సపోర్ట్ చేసే విధంగా ఉన్నారు. అంతేనా తమ కుటుంబ సభ్యులను వైసీపీ లో చేర్చి రాజీనామా చేయకుండా ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేయడం తో వారెంత స్మార్ట్ గేమ్ ఆడుతున్నారో అర్థమవుతుంది..

ఇక తాజాగా టీడీపీ పార్లమెంట్ నియోజక వర్గ ఇన్ ఛార్జ్ లను నియమించిన సంగతి తెలిసిందే.. అయితే ఆ నియామకంలో చాలామంది టీడీపీ నేతల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేశాడని విమర్శలు వస్తున్నాయి.. ఉదాహరణకి ప్రకాశం జిల్లాను తీసుకుంటే ఇక్కడ నూకసాని బాలజీని నియమించారు. మొన్నటి వరకూ దామచర్ల జనార్థన్ ఉండేవారు. ఆయన్ని కాదని వేరే వారికి ఇవ్వడం ఎవరికీ నచ్చడం లేదు.. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ సోమిశెట్టి వెంకటేశ్వర్లును నియమించారు. కర్నూలు సిటీ ఇన్ ఛార్జి టీజీ భరత్ తప్పించి ఈయన నియామకాన్ని ఎవరూ స్వాగతించడం లేదు. విశాఖ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విశాఖలో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నా ఒక్కరూ యాక్టివ్ గా లేరు. ఈ పరిస్థితుల్లో పల్లా శ్రీనివాస్ కు పార్లమెంటరీ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా టీడీపీ నేతల అసమ్మతి తో టీడీపీ పతనానికి చంద్రబాబే కారణమవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..

రాష్ట్రానికి చంద్రబాబు ఇప్పుడొచ్చి ఏం చేద్దామని..?

మరోసారి వారికి చంద్రబాబు తన స్టైల్ లో వెన్నుపోటు..?

అక్కడ టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట.?

చంద్రబాబు అవినీతి కి ఎందుకు కొమ్ము కాస్తున్నాడు.?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -