చంద్రబాబుకు జలక్ ఇస్తున్న తెలుగు తమ్ముళ్లు..!

1023
TDP Leaders do not care about Chandrababu
TDP Leaders do not care about Chandrababu

గత మూడు రోజుల క్రితం ఆయాసం తో కూడిన చంద్రబాబు ఆవేశం గమనించిన వారంత ఖచ్చితంగా అద్భుతం ఆశించారు. 48 గంటల తర్వాత ఇక తగ్గేది లేదు సమయం లేదు తమ్ముళ్ళు రాజీనామాలకు సిద్ధంకండి అంటారని అంతా భావించారు. కానీ అది జరగకపోయేసరికి అంతా చంద్రబాబుదే నేరం అన్నట్లుగా విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ నేరం చంద్రబాబుది కాదట.. టీడీపీ నేతలదట. అది కూడా చంద్రబాబు కంటే బలంగా వారు ఆలోచించడమే. అవును చంద్రబాబు తన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేస్తారని ఊహించిన సంగతి తెలిసిందే.

కానీ మాటలకు చేతలకు చాలా తేడా ఉందని తన నుంచి రెండోది ఎక్కువగా ఆశించిందని చంద్రబాబు మరోసారి నిరూపించారు. అయితే ఇక్కడ చంద్రబాబు ఒక స్కెచ్ వేశారని అంటున్నారు. కానీ ఆ ఆటలు టీడీపీ నేతలే సాగనివ్వలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముందుగా 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి అనంతరం ఎంపీలు తర్వాత ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేయిద్దామని చంద్రబాబుకు సూచనలు అందాయట. ఈ ఆలోచనకు బాలయ్యతో కలిపి మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరు ఒప్పుకోలేదని అంటున్నారు. అయితే తాను సేవ్ అయ్యే క్రమంలో రాష్ట్రం అంతా వద్దు.. కేవలం అమరావతి ప్రాంతం నేతలతోనే రాజీనామా చేయించాలని స్కెచ్ వేసారట. అలా అయితే చంద్రబాబు అండ్ చిన్న బాబు కూడా వారి సీటులను కాపాడుకున్న వారవుతారు కాబట్టి.. ఇందులో భాగంగా మద్దాల గిరి, వల్లభనేని వంశీ లాంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే ఫ్యాన్ కింద సేదతీరుతున్న సమయంలో ఇద్దరు ఎంపీలపై చంద్రబాబు దృష్టి సారించారని అంటున్నారు.

వారిలో ఒకరు కేసినేని నాని కాగా మరొకరు గల్లా జయదేవ్. వీరిలో ఒకరికి స్ట్రాంగ్ గా స్పందించి నో అంటే మరొకరు కాస్త సాఫ్ట్ గా స్పందించి నో అన్నారంట. ఇక మిగిలిన ఆంధ్ర ప్రాంతంలోని నేతలు కూడా అమరావతి కోసం అని ఆలోచిస్తే నియోజకవర్గంలో ప్రజలు బయట తిరిగి ఇవ్వరని భయపడుతున్నారట. ఇక సీమ విషయానికి వస్తే అక్కడ గెలిచేది చంద్రబాబు బాలకృష్ణ మాత్రమే. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే విశాఖకు వస్తున్న రాజధాని ఆపాలని అనడమే తాము చేసే అతి పెద్ద నేరం. ఇక ఏకంగా విశాఖకు రాజధాని హోదా వద్దని రాజీనామ కూడా చేస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుందని సెలవు ఇచ్చారట. దీంతో ఒకప్పుడు కింగ్ గా ఉంటూ పార్టీ నేతలను శాసించిన చంద్రబాబు పరిస్థితి చాలా దారుణంగా తయారయింది కామెంట్లు వినిపిస్తున్నాయి.

వైసీపీలో చేరుతా.. కానీ ఆ పని చేయాలి : జేసీ సంచలన వ్యాఖ్యలు

జగన్ సర్కార్ కొత్త నిర్ణయం.. కరోనా రోగి వద్ద కాలింగ్‌ బెల్‌.. !

జగన్ కొట్టి మాట్లాడతారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన పృథ్వీ..!

జగన్ హ్యాపీ ఫీల్ అయ్యే విషయం చెప్పిన చిరు, సురేష్ బాబు..!

Loading...