Thursday, April 25, 2024
- Advertisement -

బాబులా డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదుః టిడిపి ఎమ్మెల్యే

- Advertisement -

ఒక వైపు సర్వేలన్నీ కూడా ఈ సారి టిడిపి వాష్ అవుట్ అవ్వడం ఖాయం అని తేల్చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు సభలకు కనీస స్థాయి స్పందన కూడా ఉండడం లేదు. అన్నింటికీ మించి స్వయంగా టిడిపి నాయకులు, ఎమ్మెల్యేలే చంద్రబాబుకు ఎదురు తిరుగుతున్నారు. చంద్రబాబు డ్రామా రాజకీయాలు, అబద్ధపు రాజకీయాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలుగా ఎదుగు బొదుగూ లేని సాక్షి టివి రేటింగ్స్ కూడా ఇప్పుడు అగ్రస్థానంలో ఉంటున్నాయి. పరిస్థితులన్నీ చూస్తుంటే చంద్రబాబు ప్రచార జిమ్మిక్కులు కూడా 2019 ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్నివైపుల నుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతూ ప్రస్ట్రేషన్‌లో పడిపోతున్న వైనం కళ్ళకు కనిపిస్తూనే ఉంది.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చివరి బడ్జెట్ కూడా ఫైనల్ చేసిన తర్వాత ఈ రోజు నల్ల చొక్కాలేసుకుని అసెంబ్లీకి రావాలంటే కొత్త డ్రామాకు తెరతీశాడు చంద్రబాబు. ఇన్నాళ్ళకు చంద్రబాబుకు సరిగ్గా సరిపోయే చీకటి వ్యవహారాలకు సంబంధించిన నల్లచొక్కా వేసుకున్నాడని సోషల్ మీడియాలో పడుతున్న కౌంటర్స్‌ని పక్కన పెడితే స్వయంగా టిడిపి ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నల్లచొక్కాల డ్రామాలు తప్పు పడుతున్నారు. స్వయంగా టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా నల్ల చొక్కా ధరించకుండా మామూలుగానే వచ్చి బాబుకు షాక్ ఇచ్చాడు. ఇక గుంటూరు జిల్లా టిడిపి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అయితే ఈ నల్ల చొక్కా డ్రామాలు అవసరం లేదు అని నిరసన మామూలుగా కూడా తెలపొచ్చని బాబు రాజకీయాన్ని ఎద్దేవా చేశాడు.

ఈయన బాబు చెప్పినట్టుగా నల్ల చొక్కా ధరించకుండా మామూలు డ్రెస్‌లోనే అసెంబ్లీకి వచ్చాడు. బాబు ఇచ్చిన ఆదేశాలను టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులే లెక్క చేయకపోవడం, చంద్రబాబువి రాజకీయ డ్రామాలు అనేలా టిడిపి ఎమ్మెల్యేలే మాట్లాడుతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినా ఈ మధ్య కాలంలో చంద్రబాబు మరీ రబ్బర్ స్టాంప్‌లా మారిపోయాడని, రాజకీయం అంతా కూడా చంద్రబాబుకు జాకీలేస్తున్న తోక మీడియా అధినేత, ఇంకొక మీడియా అధినేతలే నిర్వహిస్తున్నారని, చంద్రబాబు కేవలం వారి ఆలోచనలను అమలు చేస్తున్న రబ్బర్ స్టాంప్‌లా కనిపిస్తున్నాడని రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -