Saturday, April 20, 2024
- Advertisement -

విడ్డూరం..జగన్ ను పొగుడుతున్న టీడీపీ ఎమెల్యే..

- Advertisement -

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరికీ అర్థం కాదు.. నిన్నటివరకు తమదే రాజ్యం అనుకున్నవారు నేడు వెలివేసినట్లుగా అయిపోతుంటారు.. రాజ్యం బయట ఉన్నవారు రాజ్యాధికారం చేస్తూ ఉంటారు.. ఎప్పటికప్పుడు తెలివిగా ఉంటూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తే కానీ రాజకీయంలో ఎక్కువ కాలం అధికారంలో ఉండడం కుదరని పని.. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లోనే ఉన్నాడు.. వైఎస్ జగన్ దెబ్బకు కుదేలైపోయి అసలు రాజకీయాలలో ఉంటాడా లేడా అన్నట్లు అయన పరిస్థితి తయారైంది.

విశాఖ లో టీడీపీ కి ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి ఎదురయ్యింది. పార్టీ చెప్పినట్లు అమరావతి కి సై అందామా అంటే ఇక్కడ ప్రజలు ఊరుకునేలా లేరు.. పోనీ ప్రజలు చెప్పినట్లు విశాఖ కే కట్టుబడి ఉందామా అంటే పార్టీ లో చోటు ఉండేలా లేదు.. చంద్రబాబు ఒత్తిడి తో వారు పార్టీ మారే ఆలోచన చేస్తున్నారంటే వారు ఎంత తీవ్ర ఒత్తిడి లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.. విశాఖ‌లో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. ఈ నలుగురు టీడీపీ తరపున తమ తమ ప్రాంతాల్లో చక్రం తిప్పుతున్న వారే.. అయితే పార్టీ ఓటమి దగ్గరినుంచి పెద్దగా టీడీపీ తో సంబంధాలు లేనట్లు వారు కనిపిస్తున్నారట..

ఇక ఇటీవలే అన్ అఫీషియల్ వైసీపీ ఎమ్మెల్యే గా కొనసాగుతున్న వాసుపల్లి గణేష్ ప్రజల్లోకి వెళ్తున్నారట.. గతంలో ఉన్న ఒత్తిడి ఇప్పుడు ఆయనకు లేదు.. యన ఇద్దరు కుమారులను వైసీపీలో చేర్చి, ఆయ‌న కూడా ఆ పార్టీకి మ‌ద్ద‌తు ప‌లికిన విష‌యం తెలిసిందే. జగన్ నిజంగా గట్స్ ఉన్న నాయకుడంటూ ప్రశంసించిన‌ గ‌ణేశ్.. ఆయ‌న కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. ఇన్నాళ్లూ టీడీపీ ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల్లోకి తిర‌గ‌డానికి ఆలోచించే గ‌ణేశ్ వైసీపీ కి మ‌ద్ద‌తు ఇచ్చిన త‌ర్వాత త‌న కార్య‌క్ర‌మాల స్పీడు పెంచారు. శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల‌తో బిజీగా గ‌డుపుతున్నారు. వైసీపీ విశాఖ‌ను పరిపాలనా రాజ‌ధానిగా ప్ర‌క‌టించ‌డం.. టీడీపీ వ్య‌తిరేకించ‌డ‌మే ఇందుకు కార‌ణం.

ఎన్ని కుప్పిగంతులు వేసిన జగన్ ముందు పనిచేయవు..?

మరో సంచలనానికి తెరతీసిన సీఎం జగన్..?

జగన్ తన తండ్రి లా అంత గొప్ప పేరు తెచ్చుకోనున్నాడా..?

జగన్ Vs నిమ్మగడ్డ.. ఏపీలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -