Thursday, April 25, 2024
- Advertisement -

క‌ర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే దారి ఎటువైపో…?

- Advertisement -

టీడీపీలో టికెట్లు ద‌క్క‌ని నాయ‌కుల ప‌రిస్థితి దారుణంగా త‌యార‌య్యింది. అన్ని పార్టీలు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌డంతో ఏం చేయాలో తెలియ‌క దిక్కుతోచ‌ని ప‌రిస్థితిల్లో ఉన్నారు. చివ‌రి వ‌ర‌కు టికెట్ ద‌క్కుతాద‌ని ఆశించిన ఆశావ‌హుల‌కు చంద్ర‌బాబు బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీని న‌మ్ముకొన్న నేత‌ల ప‌రిస్థితే అలా ఉంటె వైసీపీ నుంచి ఫిరాయించిన నేత‌ల ప‌రిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు. వైసీపీ నుంచి క‌ర్నూలు ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్వీ మోహ‌న్ రెడ్డి టీడీపీలోకి ఫిరాయించారు. చివ‌రి వ‌ర‌కు టికెట్ కోసం ప్ర‌య‌త్నించి విఫ‌లం అయ్యారు. దీంతో ఒడ్డున ప‌డ్డ చేప‌లా కొట్టుమిట్టాడుతున్నారు.

వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎస్వీమోహ‌న్‌రెడ్డికి టీజీ వెంటేష్ కొడుకు భ‌ర‌త్ నుంచి టికెట్టు విష‌యంలో గ‌ట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. పార్టీ మారే స‌మ‌యంలో మ‌రో సారి త‌న‌కే టికెట్ ఇవ్వాల‌నే కండీష‌న్‌తో టీడీపీలో చేరారు. ఎస్వీ మోహ‌న్‌రెడ్డిని అవ‌స‌రానికి పార్టీలో చేర్చుకొని అవ‌స‌రం తీరాకా ఆయ‌ను టికెట్ ఇవ్వ‌కుండా దూరం పెట్టారు చంద్ర‌బాబు. అయినా కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి మరోసారి పోటీ చేసేందుకు ఎస్వీ మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. సర్వే ఫలితాల ఆధారంగా టీడీపీ టిక్కెట్టును చంద్రబాబునాయుడు టీజీ భరత్‌కు కేటాయించారు.

దీంతో మ‌న‌స్థాపం చెందిన ఎస్వీ మోహ‌న్‌రెడ్డి పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో స‌మావేశ మ‌య్యారు.ఇండిపెండెంట్‌గా ఎస్వీ మోహన్ రెడ్డి బరిలోకి దిగుతారా, మరో పార్టీ వైపు చూస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ఇవాళ కార్యకర్తల భేటీ తర్వాత ఎస్వీ మోహన్ రెడ్డి తన కార్యాచరణను ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఒక వేల వేరే పార్టీలోకి మారినా టికెట్లు ద‌క్కే అవ‌కాశం మాత్రం లేన‌ట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -