Friday, April 19, 2024
- Advertisement -

బాబు బుజ్జ‌గింపు ప్ర‌య‌త్నాలు విఫ‌లం…వైసీపీకే జైకొడుతున్న టీడీపీ నేత‌లు

- Advertisement -

రెండో సారి అధికారంలోకి రావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న టీడీపీకీ ఇప్పుడు వ‌ల‌స‌ల స‌మ‌స్య ప‌ట్టుకుంది. వ‌ల‌స‌ల‌ను ఆప‌డానికి బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డంలేదు. బాబే స్వ‌యంగా పార్టీ మారుతున్న నేత‌ల‌ను పిల‌పించుకొని మాట్లాడ‌తున్నా నేత‌లు స‌సేమీరా అంటున్నారు. వైసీపీ వైపే మొగ్గుచూపుతున్నారు. మొద‌ట్లో బాబు ఉప‌యేగించిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌నే వైసీపీ కూడా అయుధంగా వాడుకుంటోంది. ఇప్ప‌టికే ఆమంచి, మేడా, అవంతి వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మరికొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలోకి జంప్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

పార్టీ వారే వాళ్ల‌లో ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వస్తున్న వార్తలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. దీంతో బాబు పిలిపించుకొని చంద్ర‌బాబు చ‌ర్చ‌లు జ‌రిపారు. చీరాల ఎమ్మెల్య ఆమంచి కూడా చంద్రబాబు కలిసిన తర్వాతే పార్టీ మారుతున్నట్లు ప్రకటించి వైసీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు మాగుంట కూడా అదే తరహాలో చంద్రబాబు షాకిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

గ‌త కింత కాలంగా పార్టీ అధిష్ఠానం వైఖరిపై ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ తాను ఒంగోలు నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారట. దీనిపై గురువారం తన అనుచరులతో భేటీ అయి తాజా పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ఒంగోలు పార్ల‌మెంట్ స్థానాన్ని త్యాగం చేసేందుకు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సిద్ద‌మ‌య్యారు. ఇక జ‌గ‌న్‌ను క‌ల‌సి పార్టీ కండువా క‌ప్పుకోవ‌డ‌మే మిగిలింది. పార్టీ మారాల‌నుకొనే వారిని బుజ్జ‌గించినా ప్ర‌యోజ‌నం ఏముంటుంది టీడీపీకీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -