2019 ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డంపై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

470
TDP MP JC Diwakar Reddy Intersting Comments on His contesting next election
TDP MP JC Diwakar Reddy Intersting Comments on His contesting next election

అనంత‌పురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్య‌ఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డంపై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారాయి. 2019 ఎన్నిక‌ల్లో తాను పోటీ చేస్తానో లేదో తెలియ‌ద‌ని జేసీ ఆస‌క్తిక‌ర వ్యాఖ‌లు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

రాజ‌కీయాల్లోకి త‌న వార‌సుడు జేసీ ప‌వ‌న్‌ను తీసుకురావాల‌ని కొంత కాలంగా జేసీ పావులు క‌దుపుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే అభ్య‌ల‌కు కాకుండా త‌న‌కు అనుకూలంగా ఉన్న కొత్త వారికి టికెట్లు ఇవ్వాల‌ని బాబుకు సూచించారు జేసీ. అలా అయితే త‌న కొడుకును ఎంపీగా పోటీ చేయించి త‌న కొడుకును గెలిపించుకోవాల‌ని జేసీ ఆశ‌ల‌కు గండి కొట్టారు బాబు.

దీనిలో భాగంగానే త‌న స్థానంలో కొడుకును ఎంపీగా పోటీ చేయించాల‌ని జేసీ అనుకుంటున్నారు. అనంతపురం టౌన్ లో విస్తరణ పనులు ప్రారంభిస్తామని దివాకర్ రెడ్డి తెలిపారు. ఈ పనులను ఏ దుష్టశక్తులు కూడా అడ్డుకోలేవని స్పష్టం చేశారు.అనంతపురం లో గత నెల 22-23 తేదీల్లో చంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే.

టీడీపీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్నారు. గుంతకల్, సింగనమల, కల్యాణదుర్గం, కదిరి, పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనను కుటుంబ సభ్యులకు అప్పగించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తున్నారని మండిపడ్డారు.

అనంతపురం జిల్లాలో పార్టీ గెలవాలంటే సగం మంది సిట్టింగ్ నేతలకు టికెట్లు ఇవ్వొద్దని దివాకర్ రెడ్డి సీఎంకు సూచించారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ‘ప్రజా వ్యతిరేకత ఎదుర్కొనే ఎవ్వరికీ టికెట్ ఇవ్వబోం. రేపు ప్రజా వ్యతిరేకత ఎదురైతే మీకు కూడా పార్టీ టికెట్ ఇవ్వను’ అని సుతిమెత్తగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తాజాగా జేసీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.