Thursday, March 28, 2024
- Advertisement -

అనంత‌పురంలో టీడీపీకీ భారీషాక్‌…రాజీనామా డెడ్ లైన్ పెట్టిన జేసీ

- Advertisement -

విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మానంలో ఎన్డీఏ గెల‌వ‌డంతో టీడీపీ ప‌రువు పోగొట్టుకుంది. దీని ప్ర‌భారం రాష్ట్రంలో పార్టీపై ప్ర‌భావం చూపింది. దీన్ని ఆస‌రా చేసుకొని సీనియ‌ర్ నాయ‌కులు పార్టీనీ వీడేదానికి సిద్ద‌మ‌వుతున్నారు.

తాజాగా అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి బాబుకు షాక్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. తీరా టీడీపీ కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టిన సమయాన్ని అనువుగా చూసుకుని జేసీ దివాకర్ రెడ్డి తిరుగుబాటు చేశారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న తన డిమాండ్ల సాధనకు అధిష్టానంపై మ‌రోసారి తిరుగుబాట ఎగ‌రేశారు.

ఈ నెల 25 లోగా తన డిమాండ్లపై అధిష్టానం స్పందించాలని లేని పక్షంలో పార్టీకి రాజీనామా చేస్తానని కూడా జేసీ అల్టిమేటం జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. జేసీ ప్ర‌ధాన డిమాండ్ల‌లో మాజీ ఎమ్మెల్యే మధుసూదనగుప్తాను పార్టీలోకి చేర్చుకుని వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం.ఇప్ప‌టికే అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఉన్నారు.

జెసీనీ న‌మ్ముకొనే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డికి టీడీపీలో చేరారు. ఆయ‌న‌కుకూడా నామినేటెడ్ పదవి ఇవ్వాలని కోరడం. అనంతపురంలోని పాతూరులో రోడ్ల విస్తరణకు అనుమతి, పాతూరులో రోడ్ల విస్తరణ అంశం జేసీ పరువుకు సవాల్‌గా మారింది. టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఈ విషయంలో జేసీకి అడ్డుపడుతున్నారు. అసలు అనంతపురంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడంపై సీఎం చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు జేసీ… ఈ సందర్భంగా సంచలన విషయాలు బటయపెట్టిన జేసీ దివాకర్‌రెడ్డి అనంతపురంలో టీడీపీ తొలి వికెట్ ఔట్ అని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -