Thursday, April 25, 2024
- Advertisement -

అయోమయంలో టీడీపీ ఇన్ ఛార్జ్ లు…

- Advertisement -

తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత చేసిన మొట్టమొదటి మంచి పని, పార్టీ ని బలంగా మార్చుకునే దిశగా చేసిన తొలి పని ఇన్ ఛార్జ్ లను నియమించడం..  ఎంతో కష్టపడి పట్టుకోలోపోయిన ప్రాంతాలలో తాను కూడా పట్టు కోల్పోయినా పట్టించుకోకుండా చంద్రబాబు ఈ జాబితా ను తయారు చేశారు.. మొత్తం 25 పార్లమెంట్ నియోజక వర్గాలకు గాను టీడీపీ ఇన్ ఛార్జ్ లను నియమించింది.. అయితే ఇప్పుడు అందరి మెదళ్లలో తలెత్తే ఒకే ఒక ప్రశ.. ఈ ఇన్ ఛార్జ్ లు ఏం చేయాలి.. ఎంతో హడావివిది చేసి చంద్రబాబు భారీ ఎత్తున అయితే ఈ నియామకం చేపట్టారు.. కానీ వీళ్లిప్పుడు ఏం చేయాలి..

నియోజక వర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంతో కొంత కష్టపడితే పార్టీ కి ప్రజల్లో పోయిన బలం తిరిగి వస్తుంది.. కానీ ఏ అధికారాలు లేని ఈ ఇన్ ఛార్జ్ లు ఇప్పుడు ఏం చేయాలి.. అసలే అధికార పార్టీ కి భయపడి చాలామంది తలపండిన నేతలు ఇంట్లోనుంచి బయటకు రావట్లేదు. ఈ నేపథ్యంలో ఎలాంటి అనుభవం లేని పార్లమెంట్ ఇన్ ఛార్జ్ లు వచ్చి ఏమని పోరాటాలు చేస్తారు..  నియామకాలు పొందిన వాళ్ళు క్షేత్రస్థాయిలోకెళ్ళి ఏదైనా కార్యక్రమం చేద్దాముంటే  కలిసొచ్చే పరిస్థితులు కన్పించడం లేదన్న టాక్‌ విన్పిస్తోంది.స్వయంగా పార్టీ అధినేత సెలవిస్తేనే కేడర్‌ లైట్‌ తీసుకుంటోందని, ఇక తమనెవరు పట్టించుకుంటారన్న భావనలో ఉన్నారట. గతంలో చంద్రబాబు సై్టల్‌ ఆఫ్‌ మోనటరింగ్‌ ఎలా ఉండేదో వారంతా గుర్తు చేసుకుంటున్నారట.

తాను చెప్పిన టాస్క్‌లను ఎప్పటికప్పుడు పక్కాగా పూర్తి చేసి, ఆ ఫోటోలను పార్టీ సైట్‌లోకి అప్‌డేట్‌ చేయాలి. వాటిని పరిశీలించి ర్యాంకులు కేటాయిస్తుండేవారు. తద్వారా నాయకుల మధ్య పోటీ సృష్టించేవారు. దీంతో మీ నియోజకవర్గం వెనుకబడిందంటే మీ నియోజకవర్గం వెనుకబడిందంటూ నాయకుల మద్య జోరుగా చర్చలు జరుగుతుండేవి. ఇప్పుడు కూడా ఇటువంటిదేదైనా అమలు చేస్తే ర్యాంకుల కాదు కదా కనీసం పాస్‌మార్కులు కూడా రావని కొత్త ఇన్‌ఛార్జిలే వ్యాక్యానించడం ఇక్కడ గమనార్హం.ఎక్కడో హైదరాబాద్ లోఉంది చంద్రబాబు బిగ్ బాస్ మాదిరిగా ఆదేశాలిస్తా ఏపార్టీ ఎలా పుంజుకుంటుంది.. ప్రజల్లోకి వస్తేనే కదా వారిలో చైతన్యం కలిగేది.. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..

వైసీపీలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే..!

టీడీపీ కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న టీడీపీ నేతలు..?

ఎన్టీఆర్ కూడా మొదలుపెట్టడా.. భార్య తో కలిసి..?

చంద్రబాబు ను టార్గెట్ చేస్తున్న టీడీపీ నేతలు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -