Friday, April 19, 2024
- Advertisement -

ఈరోజు మంగళవారం అంట.. దసరా తర్వాత టీడీపీ..?

- Advertisement -

టీడీపీ లో ఫైర్ బ్రాండ్ ల నేతలకు కొదువ లేదు.. చంద్రబాబు హయాంలో చంద్రబాబు పై ఈగ కూడ వాలనిచ్చేవారు కాదు ఈ ఫైర్ బ్రాండ్ లు..  టీడీపీ తరపున అప్పటి ప్రతిపక్షాలను కోలుకోనివ్వకుండా చేశారు.. టీడీపీ తో పెట్టుకోవాలంటే వీళ్ళను చూసి సగం భయపడేవాళ్లు ప్రతిపక్ష నేతలు.. ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా వీరు చేసే విమర్శలు మారుతూ వచ్చాయి.. యంగ్ లీడర్స్  కూడా సోషల్ మీడియా ద్వారా ఇతర పార్టీ నేతలను విమర్శించేవారు.. అలాంటిది ఈ నేతల నోళ్లు గత కొన్ని నెలలుగా మూగబోయాయి..

గత కొద్దీ రోజులుగా వీరు వైసీపీ పై పెద్దగా వ్యాఖ్యలు చెయ్యట్లేదు.. అందుకు కారణం ఎక్కడ జగన్ కు కోపం తెప్పిస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుందేమోనని అంట. ఇప్పటికే అచ్చెన్న వంటి పెద్ద పెద్ద లీడర్లను జగన్ ఊచలు లెక్క పెట్టించాడు. ఇప్పుడు ఉన్న సమయంలో మంచి గా మాట్లాడిన టీడీపీ నేతలను లోపల వేయిస్తున్నాడు.. అలాంటి విమర్శిస్తే ఇంకేమైనా ఉందా అని భయపడుతున్నారట.. ఇదిలా ఉంటే పార్టీ ని బలోపేతం చేయాలని చంద్రబాబు చాలా కృషి చేస్తున్నాడు.. రకరకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా చేస్తున్నారు..

ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులను పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నియోజకవర్గాల్లో బీసీ సామాజిక వర్గాలకు ఇద్దరు ఇంచార్జ్ లు, ఎస్సీ, ఎస్టీకి ఇద్దరు ఇంచార్జ్ లను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా నియోజకవర్గాల్లో బీసీలకు, వెనుకబడిన వర్గాలకు మరింతగా దగ్గర కావొచ్చు అనేది చంద్రబాబు భావన. ఇందులో మహిళలకు కూడా పెద్ద పీట వేయనున్నారు. సంక్షేమ కార్యక్రమాల లోపాలను, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించే విధంగా ఈ వ్యవస్థలను పార్టీ అధిష్టానం ఏర్పాటు చేస్తుంది. సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసుకునే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. దసరా తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన ఉంటుంది. ఆ ప్రకటన తర్వాత వీటిని కూడా ప్రకటిస్తుంది పార్టీ అధిష్టానం. ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం మొదలు పెడుతుంది.

చంద్రబాబు చెప్పేది మరీ చోద్యంగా ఉంది..?

చంద్రబాబు కు జగన్ అంటే ఎందుకింత అసూయా…!

టీడీపీ ఇంత దిగాజరడానికి చంద్రబాబే కారణమట..

తెలంగాణా లో ఆ పార్టీ అసలు ఉందా లేదా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -