ఎమ్మెల్యే పదవికి వల్లభనేని రాజీనామా ?

1162
TDP Vallabhaneni Vamsi quits MLA post
TDP Vallabhaneni Vamsi quits MLA post

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రం మొత్తం తమ సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో వైసీపీని ఎదుర్కొని టీడీపీ తరుపున గన్నవరం నుంచి వంశీ గెలిచాడు. కానీ తర్వాత జరిగిన పరిణామాలతో వంశీ టీడీపీలో ఉండలేకపోయారు. టీడీపీ నుంచి గెలిసి వైసీపీకి మద్దతు పలుకుతున్నారనే అపవాదు ఉంది. దాంతో వల్లభనేని వంశీని టీడీపీ నేతలు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.

దాంతో టీడీపీకి దూరంగా ఉంటున్న వంశీ.. ప్రస్తుతం శాసనసభలో టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీకి మద్దతు ప్రకటించాడు. అంతేకాకుండా టీడీపీకి పూర్తిగా బై బై అనాలని.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ తరుఫున గన్నవరంలో పోటీచేసి గెలవాలని ఆలోచిస్తున్నాడట. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ను ఒప్పించాలని చూస్తున్నాడట. టీడీపీ నేతల విమర్శల దృష్ట్యా.. ఉప ఎన్నికల్లో గెలిచి సగర్వంగా వైసీపీ ఎమ్మెల్యేగానే అసెంబ్లీలో కూర్చోవాలని ఆలోచిస్తున్నాడట. ఇటు టీడీపీ కేడర్ అటు వైసీపీ కేడర్ తో ఈజీగా గెలుస్తాననే ధీమా వంశీలో ఉందట.

అయితే టీడీపీలో అటు వైసీపీలోనూ వంశీకీ వ్యతిరేకంగా కొందరు ఉన్నారు. అయితే ఇది కాస్త వంశీకి నిరాశ కలిగించే విషయమే. అయితే వంశీ మాత్రం తనతోపాటు మద్దాల గిరి కరణం బలరాంలు ముగ్గురూ రాజీనామా చేసి వైసీపీ తరుఫున నిలబడి గెలవాలని స్కెచ్ వేశారట. ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే టీడీపీకి ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్దం అయ్యారట. అయితే ఈ విషయంలో వైసీపీ అదిష్టానం తొందరపడటం సరి కాదని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ కంటే జగనే బెటర్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎంపీ రఘురామకు ఊహించని షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు..!

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. అన్ని ఆసుపత్రిల్లో కరోనా ఉచిత చికిత్స..!

ఎవరికి తెలియని విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయి : వైఎస్ షర్మిల

Loading...