ఐటీలో కూడా చంద్రబాబు పీకిందేమీ లేదు…కేసీఆర్‌

469
Telangana CM KCR Fire on Chandra Babu Naiudu
Telangana CM KCR Fire on Chandra Babu Naiudu

ఐటీలో హైద‌రాబాద్‌ను ప్ర‌పంచ ప‌టంలో పెట్టాన‌ని సొంత డ‌బ్బాకొట్టుకొనే బాబు గాలి తీశారు తెంగాణా సీఎం కేసీఆర్‌. హైద‌రాబాద్‌లో సైబ‌ర్ ట‌వ‌ర్స్‌కు ఆద్యులు దివంత‌గ పీఎమ్ రాజీవ్‌గాంధీ, దివంగ‌త మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డని కేసీఆర్ అన్నారు. బాబుకున్న ఒక‌టి రెండు తొక ప‌త్రిక‌లు సొంత డ‌బ్బాకొట్ట‌డం త‌ప్ప చేసిందేమిలేద‌న్నారు.

అంతర్జాతీయ కంపెనీలు ప్రపంచం మొత్తంలో సేఫ్ జోన్ ఎక్కడుంటే అక్కడ వాటిని ఏర్పాటు చేస్తాయ‌ని… వాటికి హైద‌రాబాద్ సేఫ్ జోన్‌లా క‌నిపించింద‌ని అందుకే ఇక్క‌డ ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేశార‌న్నారు. స్వాభావిక, భౌగోళిక అడ్వాన్టేజ్ వల్ల హైదరాబాద్‌కు ఐటీ వచ్చింది కానీ.. చంద్రబాబు వల్ల కాదు. ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. కానీ.. మేమెప్పుడూ బాకా కొట్టుకోలేదన్నారు.హైదరాబాద్‌కు ఐటీని నేను తీసుకొచ్చినా అని చంద్రబాబు ఎలా డప్పాలు కొడుతున్నాడంటూ .. సీఎం కేసీఆర్ ఎద్దేవ చేశారు.

ఐటీలో చంద్రబాబు పీకిందేం లేదని కేసీఆర్ ఘాటుగా విమర్శించారు. తాను ప్రతిపాదించే అర్థిక నమూనాపై చంద్రబాబుకు అవగాహన లేదని కేసీఆర్ అన్నారు. రైతుబంధు పథకాన్ని దేశం మొత్తం ఫాలో అవుతోందని, తమ పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారని అన్నారు. కల్యాణలక్ష్మి, పారిశ్రామిక రాయితీలను కాపీ కొట్టారని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

Loading...