Friday, April 26, 2024
- Advertisement -

కేసీఆర్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు

- Advertisement -

కేసీఆర్ కోటరీని చేరడం కష్టమంటారు.. ఆయన కోటలోకి అడుగుపెట్టడం అంత ఈజీ కాదంటారు.. కేసీఆర్ ను సామాన్యులు కలవలేరంటారు.. ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటాయి. అందుకే కేసీఆర్ సడన్ గా ఎన్నికల వేళ రూటు మార్చేశారు. అందరినీ ఆశ్చర్యపరిచాడు..

కేసీఆర్ ప్రజల్లోకి స్వయంగా వెళ్లారు. వారితో డైరెక్ట్ గా మాట్లాడరు అనే విమర్శ ఉంది. పార్లమెంట్ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు ఇదే విమర్శను ప్రబలంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. అందుకే కేసీఆర్ ఓ సామాన్య రైతు బాధను తనకు అనుకూలంగా మార్చేశారు. ఆయన బాధను తీర్చడంతోపాటు రైతుల పక్షాన నిలబడ్డట్టు ఫోకస్ చేశారు.

కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు చెందిన రైతుకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి ఆయన సమస్యను పరిష్కరించారు. కేసీఆర్ ఫోన్ ఇన్ లో ఒక విషయాన్ని చివరలో ప్రస్తావించారు. నీ సమస్య పరిష్కారమైందని ఇంట్లో పడుకోకని.. దీనిపై రోడ్డు మీదకు వచ్చి కేసీఆర్ న్యాయం చేశాడని నినదించాలని.. ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా మాట్లాడాలని కోరారు.

దీన్ని బట్టి కేసీఆర్ ఇంటెన్షన్ అర్థమైపోయింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తరహాలో కేసీఆర్ స్ట్రాటజీ అర్థమైంది. ఇటు రైతు సమస్య పరిష్కారం కావడంతోపాటు అటు తాను చేస్తున్న మంచి పనులను ఫోకస్ చేయాలని తద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్న సందేశాన్ని కేసీఆర్ ఇచ్చినట్టైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -