Tuesday, April 23, 2024
- Advertisement -

కేసీఆర్ ప్ర‌మాణ‌స్వీకారానికి ముహూర్తం ఖ‌రారు…

- Advertisement -

తెలంగాణా ఎన్నిక‌ల్లో కారు జోరుకు కూట‌మి బేజార‌య్యింది. బంప‌ర్ మెజారిటీతో కారు దూసుకుపోయింది. 88సీట్ల‌తో తిరుగ‌లేని మెజారిటీ సాధించింది. కేసీఆర్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారయింది. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు కేసీఆర్ రెండో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

రెండో సారి సీఎంగా ఏ రోజున ప్రమాణం చేయాలనే విషయమై కేసీఆర్ జ్యోతిష్య పండితులతో చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ పూర్తిస్థాయి కేబినెట్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

రాజ్ భవన్ లో కేసీఆర్ తో పాటు కొందరు మంత్రుల చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి సీనియర్ పోలీసు అధికారులు గవర్నర్ తో భేటీ అయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమంపై చర్చించారు. గవర్నర్ కలిసిన వారిలో పోలీస్ కమిషనర్లు అంజన్ కుమార్, మహేశ్ భగవత్, రంగనాథ్ లు ఉన్నారు.

డిసెంబర్ 13వ తేదీన తెలంగాణ సీఎంగా రెండో సారి కేసీఆర్ ప్రమాణం చేస్తారు.రేపు ఉదయం 11 గంటల్లోపుగా మూడు మంచి ముహుర్తాలు ఉన్నాయి. ఈ ముహుర్తాల్లో మంచి ముహుర్తంలో కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఈ ముహుర్తాల్లో మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఉన్న ముహుర్తాన్ని కేసీఆర్ ఎంచుకొన్నారు.రాజ్‌భనవ్ లో కేసీఆర్ ప్రమాణం చేయనున్నా.

గత టర్మ్‌లో మంత్రులుగా ఉన్న నలుగురు ఓటమి పాలయ్యారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఈ దఫా కొత్త ముఖాలకు చోటు దక్కే అవకాశం లేకపోలేదు. మహిళలకు కూడ ఈ దఫా మంత్రివర్గంలో చోటు దక్కనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -