Thursday, April 25, 2024
- Advertisement -

కేసీఆర్ కలలపై కాంగ్రెస్ ఫైట్

- Advertisement -

తెలంగాణ సీఎం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలపై కాంగ్రెస్ పోరుబాటకు శ్రీకారం చుట్టింది. తాజాగా ప్రస్తుతం ఉంటున్న పాత సెక్రెటేరియట్ భవనాల కూల్చివేతను ఈరోజు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క కాంగ్రెస్ నేతలు పొన్నం, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పరిశీలించి కేసీఆర్ తీరును ఎండగట్టారు.

ఈ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కొత్త భవనాల నిర్మాణాల నేపథ్యంలో చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. పాత సెక్రెటేరియట్ భవనాలను కూలగొడుతున్న ప్రదేశానికి కాంగ్రెస్ నేతలు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఉద్యమిస్తామన్నారు. తన పేరు చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ కొత్త అసెంబ్లీ, కొత్తసెక్రెటేరియట్ భవనాలను నిర్మిస్తున్నారని ఆరోపించారు.

1985లో ప్రారంభమైన ఈ సచివాలయం అన్ని వసతులతో ఉన్నదని.. బిల్డింగ్ నాణ్యత, సక్రమంగా ఉన్నా దీన్ని కేసీఆర్ కూల్చుతూ కొత్తది కడుతుండడం తుగ్లక్ చర్యగా భట్టి విక్రమార్క అభివర్ణించారు. రాష్ట్రంలో తాగుసాగునీటి కష్టాలు పక్కనపెట్టి కేసీఆర్ వీటిని ముందేసుకున్నారని భట్టి ఆరోపించారు.

ఈ సందర్భంగా కొత్త అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలను అడ్డుకుంటామని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని భట్టి సంచలన ప్రకటన చేశారు. దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రత్యక్షంగా.. హైకోర్టుకెక్కి ఈ భవన నిర్మాణాలను అడ్డుకోవడానికి రెడీ అయ్యింది. మరి కేసీఆర్ దీనిపై ఏం చేస్తారన్నది రాజకీయంగా వేడిపుట్టిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -