Friday, April 19, 2024
- Advertisement -

విన్న‌ర్ కేసీఆరే… ఇండియా టుడేస‌ర్వే..

- Advertisement -

తెలంగాణా ఎన్నిక‌ల్లో కారుకు తిరులేదు. మ‌రో సారి సీఎం పీఠం కేసీఆర్‌దేన‌ని అనేక స‌ర్వేలు ఇప్ప‌టికే వెల్ల‌డించాయి. తాజాగా ఇండియా టూడే ఇదే విషయాన్ని స్ప‌ష్టం చేసింది. ఒక ప‌క్క తెలంగాణాలో మ‌హూకూట‌మిదే విజ‌యం అని ల‌గ‌డ‌పాటి స‌ర్వేకు పూర్తి వ్య‌తిరేకంగా ఇండియా టుడే స‌ర్వే ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది.

ఇండియా టుడే పొలిటికల్‌ ఎక్స్‌ఛేంజ్‌’ పేరిట తాము 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూలు నిర్వహించామని ఇండియాటుడే గ్రూప్ తెలిపింది. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 48 శాతం మంది ప్రజలు మద్దతు ఇస్తుండగా, మహాకూటమి అధికారంలోకి రావాలని 38 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు వెల్లడించింది.

గ‌త నెల‌లో టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తిస్తున్న వారి సంఖ్య ప్ర‌స్తుతం 4 శాతం పెరిగింద‌ని ఇండియా టుడే తెలిపింది. అధికార, విపక్షాల మధ్య కేవలం 10 శాతం మాత్రమే ఓట్ల తేడా ఉంటుందని సర్వే స్పష్టం చేసింది. ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయబోతుండగా, దక్షిణ తెలంగాణలో మాత్రం మహాకూటమి సత్తా చాటబోతోందని ఇండియా టుడే పొలిటికల్‌ ఎక్స్‌ఛేంజ్‌ సర్వేలో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కల్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్లు ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశమని సర్వే అభిప్రాయపడింది. మ‌రో వైపు మ‌జ్లిస్ పార్టీ స‌పోర్ట్ కూడా టీఆర్ఎస్‌కే ఉండ‌టం క‌ల‌సి వ‌చ్చే అశం. ప్రతి పార్లమెంట్‌ నియోజక వర్గంలో టెలిఫొనిక్‌ ఇంటర్వ్యూ ద్వారా 6,887 శాంపుల్స్‌ తీసుకున్నట్లు తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -