ఎవ‌రికి ఓటు వేయాలో జ‌న‌సైనికుల‌కు చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

497
Telangana Election 2018 : Pawan Kalyan said in the vote in Telangana to Party Caders
Telangana Election 2018 : Pawan Kalyan said in the vote in Telangana to Party Caders

తెలంగాణా ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. నెల‌రోజుల‌నుంచి పార్టీలు అభ్య‌ర్తులు,ఎన్నిక‌ల ప్ర‌చారంలో మునిగితేలారు. అధికార‌పార్టీ టీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, జ‌న‌స‌మితి క‌ల‌సి మ‌హాకూట‌మిని ఏర్పాటు అయ్యింది. అయితే జ‌న‌సేన కూడా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని ప‌వ‌న్ ఓట్లు ఎవ‌రికి వేయాలో త‌మ శ్రేణుల‌కు ట్విట్ట‌ర్ ద్వారా సందేశం ఇచ్చారు. అయితే ప‌లానా పార్టీకీ ఓటు వేయండ‌ని క్లారిటీ మాత్రం ఇవ్వ‌లేదు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, త్యాగాలను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిని తానని… అందుకే తనకు తెలంగాణ అంటే ఎనలేని గౌరవమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. సుమారు 1.49 నిమిషాల నిడివి గల వీడియోను పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

తెలంగాణను ఇచ్చామనే వారు.. తెలంగాణను తెచ్చామనే వారు… తెలంగాణను పెంచామనే వారు పోటీలో ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు.ఎక్కువ పారదర్శకతో తక్కువ అవినీతితో ప్రజా రంజక పాలన సాగించే వారేవరో లోతుగా విశ్లేషించి ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ముందస్తు ఎన్నికలైనందున తాను ఎక్కువగా సమయం కేటాయించలేకపోతున్నట్టు చెప్పారు.

Loading...