Wednesday, April 24, 2024
- Advertisement -

తెలంగాణాలో రిసార్ట్ రాజ‌కీయాల‌కు తెర‌లేపుతున్న పార్టీలు..

- Advertisement -

తెలంగాణాలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ఎన్నిక‌ల కౌంటింగ్‌కు కొన్ని గంట‌ల స‌మ‌యంలో ప్రారంభంకానుంది. గెలుపుపై ఎవ‌రి వారు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అయితే హంగ్ ఇప్పుడు పార్టీల గుండెల్లో గుబులు రేపుతోంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ రాకుంటే ఇండిపెండెంట్‌లు కీల‌కం కానుండ‌టంతో ఇత పార్టీల ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభ పెట్ట‌డం లాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం స‌హ‌జం. క‌ర్నాట‌క‌లో కూడా ఇలానే జ‌రిగింది. అక్క‌డ ఉప‌యోగించిన ౠపార్ములానే తెలంగాణాలో కూడా ఉప‌యోగించాల‌ని కాంగ్రెస్ అధిష్టానం ఆదిశ‌గా పావులు క‌దుపుతోంది.

అధికార పీఠం కోసం బీజేపీ, కాంగ్రెస్ మధ్య జరిగిన పోరు.. రిసార్ట్ రాజకీయాలకు దారి తీసింది. ఆ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి యడ్యూరప్పను సీఎంగా ప్రమాణస్వీకారం చేయించిన బీజేపీ.. కాంగ్రెస్ వేసిన ఎత్తుగడతో వారం తిరగకుండానే బలపరీక్షలో ఓడిపోయి, అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ, తనకన్నా తక్కువ సీట్లున్న జేడీఎస్‌కు సీఎం పదవిని కట్టబెట్టింది. తెలంగాణాలో కూడా క‌న్న‌డ రాజ‌కీయం రిపీట్ కాబోతుంద‌నే ప‌రిస్థితులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై అప్రమత్తమైన కాంగ్రెస్ హైకమాండ్.. హంగ్ ఏర్పడితే ఎలా వ్యవహరించాలనే దానిపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ‌కుమార్ రెడ్డిని ఢిల్లీకి రప్పించుకుని చర్చలు జరుపుతోంది. మరోవైపు.. పార్టీ రెబల్స్‌తో, ఇండిపెండెంట్ అభ్యర్థులతో టచ్‌లో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం.. వాళ్లలో గెలిచే అవకాశాలు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అవ‌స‌రం అయితే రిసార్ట్ రాజ‌కీయాల‌కు తెర‌లేపేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.

గెలిచే అవకాశాలున్న ఇండిపెండెంట్లతో మంతనాలు జరుపుతున్న కాంగ్రెస్ పెద్దలు.. వారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులు రాములు నాయక్, జలంధర్, శివకుమార్ రెడ్డిలను క్యాంప్‌కు పంపినట్టు తెలుస్తోంది. కర్నాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్‌ను రంగంలోకి దింపింది కాంగ్రెస్. రాత్రిలోపు ఆయన హైదరాబాద్‌కు రాబోతున్నారు. క్యాంపు రాజకీయాలు చేయడంలో దిట్టగా పేరున్న శివకుమార్ కు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌నుంది.

మ‌రో వైపు టీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగింది. కేటీఆర్‌, హ‌రీష్ రావుల‌ను రంగంలోకి దింపింది టీఆర్ఎస్‌. ఇప్ప‌టికే గెలిచే స్వ‌తంత్ర అభ్య‌ర్తుల‌తో ట‌చ్‌లో ఉన్నారు. వారితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. రేపు ఎవ‌రు పూర్తి మెజారిటీతో అధికారాన్ని చేప‌డ్తారు లేకా హంగ్ వ‌స్తుందా అన్నది కొద్ది గంట‌ల్లో తేలిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -