Friday, March 29, 2024
- Advertisement -

తెలంగాణా ఫలితాల తొలిదెబ్బ…… వైకాపాలోకి టిడిపి మంత్రి జంపింగ్ షురూ

- Advertisement -

తెలంగాణా ఫలితాల్లో చావుదెబ్బతిన్న చంద్రబాబును కాపాడాలని బాబు భజన మీడియా ఎంత కవరింగ్ చేస్తున్నా టిడిపి నాయకులకు మాత్రం విషయం అర్థమైపోయింది. 2019 ఎన్నికల్లో దాదాపు 5శాతం మార్జిన్ కంటే ఎక్కువ ఓట్ల శాతం తేడాతో వైకాపా గెలవడం ఖాయం అన్న విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అర్థం చేసుకుంటున్నారు. జాతీయ స్థాయి సర్వే సంస్థలైతే పది శాతంకంటే ఎక్కువ తేడాతో టిడిపిపై వైకాపా గెలుస్తుందని చెప్తున్నారు.

తెలంగాణాలో ఉన్న సీమాంధ్ర ఓటర్లందరూ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన విషయం కూడా టిడిపి నాయకులను భయపెడుతోంది. నందమూరి కుటుంబం నుంచి అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ చంద్రబాబు టిడిపికి ఓట్లేయడానికి సీమాంధ్ర ఓటర్లు ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టిడిపిలో అసంతృప్త నాయకులందరూ వైకాపాలో బెర్త్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందరికంటే ముందుగా టిడిపి మంత్రి పితాని సత్యనారాయణ తెలంగాణా ఫలితాలు వచ్చిన వెంటనే వైకాపా నాయకుడు విజయసాయిరెడ్డికి టచ్‌లోకి వెళ్ళారని తెలుస్తోంది. జగన్‌కి ఒకే అయితే జిల్లా అంతా కూడా వైకాపా గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తానని విజయసాయితో చెప్పాడట పితాని. పితాని చెప్పిన విషయాలన్నింటినీ విజయసాయిరెడ్డి వైకాపా ముఖ్యులతో చర్చించారని తెలుస్తోంది. ఫైనల్‌గా ఈ విషయంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అన్న ఉత్కంఠ టీడీపీ నాయకుల్లో కూడా కనిపిస్తోంది.

జగన్ ఒకే చెప్తే మాత్రం స్వయంగా ఒక మంత్రి స్థాయి నాయకుడు చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం లేదంటూ వైకాపాలో చేరితే అది అధికారంలో ఉన్న టిడిపికి చాలా పెద్ద దెబ్బ అవుతుందనడంలో సందేహం లేదు. ఇలాంటి చేరికలు ఇంకా ఎన్నో కూడా మొదలవ్వొచ్చు. అసలే తెలంగాణాలో ఘోర ఓటమిని, పార్టీకి తగిలిన చావుదెబ్బని ఎలా సమర్థించుకోవాలో తెలియక విలవిల్లాడుతున్న చంద్రబాబుకు ఎపిలో కూడా వైకాపాలోకి టిడిపి నాయకుల చేరికలు షురూ అయితే మాత్రం 2019 ఎన్నికల టైంకి కనీసం కోలుకోలేని పరిస్థితుల్లో ఉంటాడన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -